వైసీపీకి ఇపుడు టీడీపీ నుంచి గట్టి సవాలే ఎదురవుతోంది. చంద్రబాబు అసెంబ్లీని వీడి బయటకు వచ్చి పోరాడుతున్నారు. మహిళలకు ఏపీలో ఆత్మ గౌరవం లేదు, రక్షణ లేదు అంటూ ఆయన గట్టిగా సౌండ్ చేస్తున్నారు. దీని కంతటికీ కారణం ఏపీ అసెంబ్లీలో రెండు వారాల క్రితం జరిగిన చేదు ఘటన.

దాని మీద ఈ రోజుకీ వైసీపీ నేతలు అక్కడ ఏమీ జరగలేదు అంటూ చెబుతూ వచ్చారు. అయితే వైసీపీకి చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా  అనంతపురం టూర్లో మాత్రల్ బోళాగా మాట్లాడేసి వైసీపీ సర్కార్ ని  ఇరుకున పెట్టేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ఆన్ రికార్డు ఏమీ జరగలేదంటూ ఇండైరెక్ట్ గా చంద్రబాబుని వైసీపీ ఎమ్మెల్యేలు అనుచితంగా కామెంట్స్ చేయడం నిజమే అన్నట్లుగా మాట్లాడారు.

తాను ఆ రోజు సభలో ఉన్నాయని, ఆన్ రికార్డుగా తమ సభ్యులు ఎవరూ కామెంట్స్ చేయలేదని, అయితే వెనక నుంచి ఎవరో ఏదో అంటే దానికి ప్రభుత్వానిది బాధ్యత  ఎలా అవుతుందని బొత్స గట్టిగా ప్రశ్నించారు. అయితే ఇక్కడే ఆయన సర్కార్ ని ఇరకాటంలో పడేశారు అంటున్నరు. అది అసెంబ్లీ. ఎక్కడో బయట కాదు, సభ పూర్తిగా స్పీకర్ ఆధీనంలో ఉంటుంది.

సభలో రన్నింగ్ కామెంటరీ చేసినా కామెంట్స్ చేసినా స్పీకర్ చర్యలు తీసుకోవాలి. మరి చంద్రబాబుకు వినిపించినది, స్పీకర్ కి కానీ వైసీపీ ప్రభుత్వ పెద్దలకు కానీ వినిపించి ఉండదా అన్న కామెంట్స్ వస్తున్నాయి. అంతే కాదు, ఆ రోజు ఏం జరిగింది అన్నది టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు సెల్ ఫోన్ల ద్వారా వీడియో రికార్డు చేశారు. దాంతో ఎవరేమన్నారో ఆ వెంటనే బయట ప్రపంచానికి తెలిసిపోయింది. అయితే సభ  రికార్డులల్లో మాత్రం ఏదీ లేదని వైసీపీ ఇప్పటిదాకా చెబుతూ వచ్చింది. కానీ అదే పార్టీకి చెందిన మంత్రి ఇలా మాట్లాడడంతో  టీడీపీకి కొత్త బలం వచ్చింది. అంటే కామెంట్స్ వైసీపీ ఎమ్మెల్యేలు చేశారు అని తేటతెల్లమైందని, ఇంకేం రుజువులు కావాలి అని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి బొత్స తన బోళాతనంతో సర్కార్ ని ఇరుకుపడేశారు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: