ఏపీలో కొద్ది రోజులుగా సినిమా టిక్కెట్లపై పెద్ద వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా ఇండస్ట్రీ తోపాటు సినిమా థియేటర్ల విషయంలో .... సినిమా టికెట్ల విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. దీంతో ఎవ‌రికి వారు ప‌లు జిల్లాల్లో స్వ‌చ్ఛందంగా త‌మ థియేట‌ర్ల‌ను మూసి వేస్తున్నారు. ఇక న‌డుస్తోన్న థియేట‌ర్ల లో కూడా టిక్కెట్ రేట్లు మ‌రీ ఘోరంగా ఉన్నాయి. అస‌లు జగన్ సర్కార్ సినిమా ఇండస్ట్రీ ని ఎందుకు ఇంతలా టార్గెట్ చేసిందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. ఇండస్ట్రీ పెద్దలు ఎవరు నోరు మెదిపే పరిస్థితి లేదు.

ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం మనసు మార్చుకుని ధరల తగ్గింపు జీవో నెంబర్ 35 ను వెనక్కి తీసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు , ఇండస్ట్రీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి ఒకరిద్దరు హీరోలను మినహాయిస్తే ఎవరూ కూడా నోరు మెదపడం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వారికి ఎందుకంత భయం అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో వైసీపీకి చెందిన మంత్రులు కూడా ఇండ‌స్ట్రీ వాళ్ల‌కు కౌంట‌ర్లు ఇస్తున్నారు.

తాజాగా రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ కూడా ఈ వివాదంపై స్పందించారు. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్లో ఉందని ... అయితే సినిమాలకు వచ్చే ఆదాయంలో ఏపీ నుంచి 70 శాతం ఉంటుందని చెప్పారు. లైట్ బాయ్‌ నుంచి టాలీవుడ్ స్టార్ హీరోల వరకు అందరికీ సంపాదన ఏపీ నుంచే వస్తుందని ... అందుకే టాలీవుడ్ పెద్దలు ఆలోచించి ఏపీకి తరలిరావాలని కోరారు.

ఏపీ ప్రభుత్వం కూడా వారికి కొన్ని రాయితీలు ఇస్తుందని భారత్ చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ భరత్ చేసిన ట్వీట్‌కు ఓ నెటిజన్ షాక్ ఇచ్చేలా రిప్లై ఇచ్చారు. మీ పార్టీ రాజ్యసభ ఎంపీ, హైదరాబాద్ లో రాంకీ గ్రూప్ పేరుతో ఇండస్ట్రీ నడుపుతున్నార‌ని.. అయితే ఆయ‌న‌కు ఏపీ లో బ్రాంచ్ ఆఫీస్ కూడా లేద‌ని.. ఆయ‌న్ను కూడా ఇక్క‌డ‌కు ర‌మ్మ‌ని చెప్పారా ? అని ప్ర‌శ్నించాడు. ఇది ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.



 

మరింత సమాచారం తెలుసుకోండి: