తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి...ఆ పార్టీ మొదటి స్థానంలో ఉందనుకోవచ్చు...ఇక ఆ పార్టీకి ధీటుగా ఉంటూ, రెండో స్థానంలో ఉన్న పార్టీ ఏది అంటే..ఇప్పుడు ఉన్న పరిస్తితుల్లో అందరూ బీజేపీ పేరు చెప్పేస్తారు. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్-బీజేపీల మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోరు నడుస్తోంది...ఆ రెండు పార్టీల మధ్య వార్ తీవ్ర స్థాయిలో జరుగుతుంది..పైగా రెండు ఉపఎన్నికల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ని బీజేపీ మట్టికరిపించింది. కాబట్టి టీఆర్ఎస్ తర్వాత బీజేపీనే ఉందని అనుకోవచ్చు.

అలాంటప్పుడు కాంగ్రెస్ పరిస్తితి ఏంటి? అంటే..ఇప్పుడున్న పరిస్తితుల్లో కాంగ్రెస్‌ది మూడో స్థానమే అని విశ్లేషకులు అంటున్నారు. కానీ ఆ పార్టీకి మూడో స్థానం కంటే రెండో స్థానంలో ఉండే అర్హతలు ఎక్కువ ఉన్నాయి...ఎందుకంటే బీజేపీ కంటే బలమైన నాయకత్వం, బలమైన క్యాడర్ కాంగ్రెస్‌కు ఉన్నాయి...ఇందులో ఎలాంటి అనుమానం లేదు..అయినా సరే కాంగ్రెస్ వెనుకబడటానికి కారణం..పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు అవే...పార్టీని మరింత వెనక్కి లాగుతున్నాయి. టి‌పి‌సి‌సి అధ్యక్షుడు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు.

అసలు చెప్పాలంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కంటే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బలమైన నేత...ప్రజాకర్షణ ఎక్కువ ఉన్న నాయకుడు. రాష్ట్ర స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న నేత..మరి అలాంటప్పుడు బండి కంటే రేవంత్ ఎందుకు వెనుకపడ్డారంటే...అలాంటి పరిస్తితులు తీసుకొచ్చేశారు. ఓ వైపు కేసీఆర్ వ్యూహాలు, మరో వైపు సొంత పార్టీలో ఉన్న పోరు వల్ల రేవంత్ రేసులో వెనుక పడ్డారు.

అయితే రేసులో బండి క్రాస్ చేయడం రేవంత్‌కు సులువే. ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నాయకుడుగా రేవంత్ ఇంకా దూసుకెళ్లగలరు. కాకపోతే ముందు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలని చక్కదిద్దాలి. సీనియర్లు రేవంత్‌కు సపోర్ట్‌గా ఉండాలి. అటు కాంగ్రెస్ అధిష్టానం మద్ధతు ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ బండికి మెండుగా ఉన్నాయి. అందుకే ఆయన దూసుకెళుతున్నారు. రేవంత్‌కు అన్నీ కలిసొస్తే బండి సంజయ్‌ని దాటగలరు..లేదంటే అంతే సంగతులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: