అయితే ఒక ఉక్రెయిన్ సైనికుడు మాత్రం తమపై అధ్యక్షుడు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పోరాడి అసువులు బాశాడు. యుద్ధంలో భాగంగా రష్యా సైనికులు ఉక్రెయిన్ లోని క్రిమియా నగరం వైపు దూసుకొస్తుండగా, అదే సమయంలో సమీపంలో ఉన్న ఉక్రెయిన్ సైనికులు వారిని ఎదుర్కొనేందుకు అప్రమత్తం అయి ఉన్నారు. రష్యా ఎదురు కాల్పులు జరిపినా ఆ సైనికులు వెనక్కు తగ్గలేదు. అయితే క్రిమియా నగరం లోకి రావడానికి అక్కడ ఉన్న బ్రిడ్జి ఒకటే దారి. అందుకే ఒక సైనికుడు ఒక ప్లాన్ వేశాడు. ఎలాగైనా ఆ బ్రిడ్జి ను కూల్చేయాలని అనుకున్నాడు. అనుకున్న విదంగానే ఆ సైనికుడు ఆ బ్రిడ్జి పైకి వెళ్లి వంతెన కూల్చడానికి బాంబులు అమర్చాడు .
కానీ వెనక్కు వెళ్ళడానికి కుదరక తానను తానే పేల్చుకున్నాడు అని సైనికులు చెబుతున్నారు. అయితే ఇంతటి ప్రాణ త్యాగానికి సిద్ధ పడిన విటాలి స్కాకున్ వోలోడిమినిరోచ్ కు ఉక్రెయిన్ దేశమంతా సలాం చేస్తోంది. ఇప్పుడు ఈ సాహసోపేతమైన చర్యను ప్రపంచం కొనియాడుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి