ఇక ప్రభుత్వ పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురుని అందించింది.వడ్డీ రేట్లని ప్రభుత్వం త్వరలో మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి.ఇక ఇదే జరిగితే స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే వారికి చాలా ప్రయోజనం లభిస్తుంది.అలాగే పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రభుత్వ పొదుపు పథకాలపై వడ్డీ రేటు ప్రస్తుత రేటు కంటే ఎక్కువగా ఉండవచ్చు. RBI రెపో రేటును పెంచిన తర్వాత వివిధ బ్యాంకులు FD ఇంకా RD వడ్డీ రేటును పెంచుతున్నాయి..ఈ మేరకు ప్రభుత్వ పథకాల పై కూడా ఈ ప్రభావం అనేది పడింది.అందుకే వడ్డీ రేట్లను పెంచనున్నారు.చిన్న మొత్తం పొదుపు రేట్లు వచ్చే నెల 30 వ తేదీ నుంచి మారే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇది జూలై నెల నుంచి సెప్టెంబర్ వరకు వర్తిస్తాయి. ఈసారి ప్రభుత్వం నుంచి పొదుపు పథకాలపై వడ్డీ రేటు పెరుగుతుందని కూడా అందరు భావిస్తున్నారు. చాలా కాలంగా కూడా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఈ పరిస్థితిలో ద్రవ్యోల్బణం దృష్ట్యా వాటిపై వడ్డీని పెంచే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి..కాగా, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు భవిష్యత్తులో రెపో రేటును పెంచవచ్చని ఆర్‌బీఐ గవర్నర్ కొద్దిరోజుల ముందు సూచించారు.వడ్డీ రేటు పెంపుతో PPF ఇంకా అలాగే సుకన్య సమృద్ధి యోజనపై రాబడులు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి కూడా వడ్డీని సమీక్షిస్తుంది. ఈ సమీక్ష సమయంలో వడ్డీ రేటును పెంచాలా ఇంకా తగ్గించాలా లేదా స్థిరంగా ఉంచాలా అనే నిర్ణయంని తీసుకుంటారు.వీటిని ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని నిర్ణయిస్తుంది.అలాగే సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టే వారికి 7.6% వార్షిక రాబడి అనేది అందుతుంది. అదేవిధంగా మీరు నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ల ఖాతా గురించి మాట్లాడినట్లయితే అది వచ్చేసి 5.8% రాబడిని అందిస్తుంది.కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు అయితే 6.9 శాతంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: