గత కొద్ది రోజుల నుంచి ఏపీ ప్రజల పై వరుణుడు ప్రతాపాన్ని చూపిస్తున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడింది.పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వచ్చే మూడు రోజుల్లో తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం ఈ నెల 20వ తేదీకి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. ఒకవేళ తీవ్ర అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారితే ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు.



అలాగే, నవంబర్ 25 నాటికి నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చునని అంచనా వేస్తున్నారు. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో. దీంతో ఆగ్నేయ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశకు ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. దీంతో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..



18, 19, 20 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ నెల 21వ తేదీన నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, కడప, ప్రకాశంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు. కాగా, ఏపీలో చలి విజృంభిస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది రాబోయే నాలుగు రోజుల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో ఉంటాయని, ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..ఏదైనా సమస్యలు ఏర్పడితే వెంటనే సమాచారం అందించాలని అధికారులు కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: