పోయిన అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసింది. కానీ పోయిన సారి కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే ఈ పార్టీ సంపాదించుకోగలిగింది. పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఈ సారి మాత్రం అలా కాకుండా ఉండాలి అనే ఉద్దేశంలో పవన్ ఒంటరిగా కాకుండా టిడిపి , బిజెపి లతో కలిసి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు.

ఇక పొత్తులో భాగంగా ఎక్కువ స్థానాలను టిడిపి కైవసం చేసుకోగా ... ఆ తర్వాత జనసేన , బీజేపీ పార్టీలు దక్కించుకున్నాయి. ఇక బిజెపి పార్టీ కొన్ని రోజుల క్రితమే ఈ పార్టీలతో కలవగా ప్రస్తుతం జనసేన , బీజేపీ పార్టీలకు కొన్ని స్థానాలను కేటాయించగా మరికొన్ని స్థానాలపై కసరత్తు జరుగుతుంది. అందులో భాగంగా విజయవాడ వేస్ట్ సీట్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనే దానిపై క్లారిటీ లేదు. కాకపోతే ఈ అసెంబ్లీ స్థానాన్ని బిజెపికి ఇచ్చే పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇక్కడి టికెట్ ను చాలా కాలం నుండి జనసేన అభ్యర్థి అయినటువంటి పోతిని మహేష్ ఆశిస్తున్నాడు. అందులో భాగంగా రెండు సార్లు పవన్ ని కూడా కలిసి తన వాదనలను కూడా వినిపించుకున్నాడు. కానీ పవన్ ఒక వేళ నీకు ఈ ప్రాంత సీటు రాకపోయిన పెద్దగా ఫీల్ కాకు ... నీకు పార్టీ అధికారం లోకి వచ్చాక మంచి పదవులను ఇస్తాను అని చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఈయన కచ్చితంగా ఆ ఏరియా సీటు తనకు కావాలి అని చెబుతూ వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సీటు విషయమై ఈయన మూడవ సారి పవన్ ను కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆ ప్రాంత సీట్ కనుక ఇవ్వనట్లు అయితే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయడానికి ఈయన రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విజయవాడ వెస్ట్ సీటు విషయంలో పట్టు వీడని పోతిని మహేష్ విషయంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: