తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజున ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి , శింగనమల వంటి ప్రాంతాలలో ప్రజాగళం పేరిట ఒక సభను సైతం ఏర్పాటు చేయబోతున్నారు అందులో చంద్రబాబు మాట్లాడబోతున్నారు.. ఇక చంద్రబాబు పర్యటన విషయానికి వస్తే.. ఉదయం 10 గంటలకు మదనపల్లి బీటీ కళాశాల నుంచి హెలికాప్టర్లో బయలుదేరి..10:45 నిమిషాలకు ప్రసన్న నాయనపల్లి అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఈ ఎలిఫ్కార్టర్ ప్లాప్ దిగబోతోంది.


ఆ తర్వాత రోడ్డు మార్గం గుండా 11 గంటలకు రాప్తాడు బస్టాండ్ కు చేరుకొని అక్కడ..12:30 నిమిషాలకు సభలు పాల్గొనబోతున్నారు ఆ తర్వాత రెండు గంటల వరకు విశ్రాంతి తీసుకుని చంద్రబాబు భోజనం చేసిన తర్వాత..2:30  నిమిషాలకు బుక్కరాయసముద్రం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన సభ కు చేరుకోబోతున్నారు.. అక్కడ 4:00 వరకు సభను ఏర్పాటు చేయబోతున్నారు చంద్రబాబు. ఆ తర్వాత 5:10 నిమిషాలకు మళ్లీ హెల్ప్ కార్డులో బయలుదేరి సత్యసాయి జిల్లా కదిరిలో NTSN ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ల్యాండ్ కాబోతున్నారు.


ఆ తర్వాత అనంతరం అక్కడ మహిళల తో మాట్లాడి..5:50 నిమిషాల నుంచి 7:30 వరకు భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి మదనపల్లికి చేరుకోబోతున్నారు చంద్రబాబు. ఈ విధంగా ఈ రోజున ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో భాగంగా చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ భాగంగా మూడు సభలలో చంద్రబాబు ప్రసంగించేలా ప్లాన్ చేస్తూ ముందుకు వెళుతున్నారు.. మరి చంద్రబాబు రావడంతో ఉమ్మడి  అనంతపూర్ జిల్లాలో సిన్ మారుతుందా అభ్యర్థుల గెలుపుకు సహాయం పడుతుందనీ తెలుగుదేశం కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.. ఇప్పటివరకు చంద్రబాబు అన్నిచోట్ల కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. ఈసారి ఎలాగైనా గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నప్పటికీ.. కొన్నిచోట్ల అసంతృప్తులు కూడా వెంటాడుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: