బీజేపీ సీనియర్ లీడర్ సుజనా చౌదరి గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఢిల్లీ రాజకీయాలు చూసిన  సుజనా చౌదరి.. బెజవాడ గల్లీకి రావడానికి రీసన్ ఏంటి.. తెర వెనుక చాలా కథ ఉందని తెలుస్తోంది.. 2014 లో ఎన్డీఏ లో ఉన్న టిడిపి.. కేంద్ర సర్కారులో భాగస్వామ్యం అయింది. పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుతోపాటు అప్పటి సీనియర్ నేత.. సుజనా చౌదరి కూడా రాజ్యసభ సభ్యుడి హోదాలో కేంద్రమంత్రి అయ్యారు. ఆ తర్వాత మారిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల బిజెపిలోకి చేరారు.


అక్కడ కూడా ఆంధ్ర రాజకీయాలలో కాస్త యాక్టివ్గానే ఉన్నారు. అయితే ఈసారి ఏలూరు లేదా విజయవాడ ఎంపీగా పోటీ చేసి పార్లమెంటులోకి అడుగు పెట్టాలనుకున్న సమయంలో అనూహ్యంగా.. సీట్ల ప్రకటన విషయం వచ్చేసరికి సీన్ రివర్స్ మారిపోయింది.. దీంతో చివరికి అసెంబ్లీకి పోటీ పడాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ విషయం పైన అటు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.. ఎంపీ కావలసిన సుజనా చౌదరిని ఎమ్మెల్యేగా పోటీ చేసేలా చేసింది ఎవరనే విషయానికి వస్తే.. సీనియర్లు సైతం అసెంబ్లీ తరహాలో బిజెపి నుంచి పోటీ చేయాలని సూచించడంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది..


ముఖ్యంగా పార్టీ ప్లాన్ ప్రకారమే ఆంధ్రాలో బిజెపి పార్టీని బలోపేతం చేయడం కోసమే హై కమాండ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ నాయకులు తెలుపుతున్నారు. ఆంధ్రాలో కూడా బిజెపి పట్టు సాధించడం కోసమే అంతేకాకుండా ప్రజలలో కూడా మరింత బిజెపి పార్టీని ఉనికి గుర్తించె విధంగా చేయడం కోసమే  ఇలా చేస్తోందని బిజెపిలో టాక్ వినిపిస్తోంది. అందుకు అనుకున్నాంగానే సుజనా చౌదరి , విష్ణుకుమార్ రాజు, సత్య కుమార్, ఆదినారాయణ రెడ్డి వంటి వారికి అసెంబ్లీ స్థానాలను కల్పించారు.. అయితే ఇలాంటివారు నిలబడడం వల్ల కూటమిలో భాగంగా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందని భావన ఉంటున్న సమయంలో.. ఇప్పుడు మరొక విషయం పార్టీ వర్గాలలో వినిపిస్తోంది.. అయితే ఇదంతా కేవలం పురందేశ్వరి ప్లాన్ ప్రకారమే జరుగుతోందని.. టాక్ వినిపిస్తోంది. ఎన్డీఏ మరొకసారి అధికారంలోకి వస్తుందని.. ఢిల్లీలో పాగ వేసేందుకే ఆమె ఇలా సీనియర్లను క్లీన్ బౌల్డ్ చేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఏపీ నుంచి కేంద్ర క్యాబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలనే చర్చ జరిగినప్పుడు తాను తప్ప .. మరే సీనియర్ నేతకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్లాన్ చేస్తోందట పురందేశ్వరి.ఇందులో  భాగంలోనే సీనియర్లను సైడ్ చేశారనేది పార్టీలో తాజాగా వినిపిస్తున్నాయి. మరి ఈమె ప్లాన్ ప్రకారమే ఆట మొదలైందని మరి బిజెపి ఒకవేళ ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో ఈమె ప్లాన్ ప్రకారమే జరిగితే సక్సెస్ అవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: