ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారనే సంగతి తెలిసిందే. కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున షర్మిల పోటీ చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీలో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలో ఆమె డిసైడ్ చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రభావం పెద్దగా ఉండదని రాజకీయ విశ్లేషకులు మొదట భావించారు.
 
అయితే షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజకీయ అనుభవం, ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతలకు మాత్రమే ఆమె టికెట్లు కేటాయిస్తున్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు ధీటుగా ఖర్చు విషయంలో సైతం వెనుకడుగు వేయని అభ్యర్థులకు మాత్రమే ఆమె ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. జగన్ పై పగతో ఆమె భారీ స్థాయిలోనే ప్లాన్స్ వేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఏపీలో కాంగ్రెస్ పోటీ వల్ల కూటమి నష్టపోతుందో వైసీపీ నష్టపోతుందో చెప్పలేం కానీ కాంగ్రెస్ ప్రభావం భారీ స్థాయిలోనే ఉండబోతుంది. 3 నుంచి 4 శాతం ఓట్లు కాంగ్రెస్ కు వచ్చే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని తెలుస్తోంది. బహిరంగ సభల్లో జగన్ పాలనపై షర్మిల చేస్తున్న ఘాటు విమర్శలు వైసీపీ కంటే జగన్ కు వ్యక్తిగతంగా నష్టం చేసే ఛాన్స్ ఉందని ప్రజల్లో చర్చ జరుగుతోంది. షర్మిల విమర్శలపై జగన్ సైలెన్స్ కూడా పార్టీకి ఒకింత మైనస్ అవుతోంది.
 
షర్మిల తాజాగా జగన్ తనకు 82 కోట్ల రూపాయల అప్పు ఇచ్చారని నామినేషన్ పత్రాల్లో పేర్కొనడం వెనుక అసలు లెక్క వేరే ఉందని తెలుస్తోంది. జగన్ తన నామినేషన్ పత్రాలలో ఈ అప్పులను సైతం ప్రస్తావించాల్సి ఉంటుంది. షర్మిలను తక్కువగా అంచనా వేస్తే మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత బాధ పడాల్సి ఉంటుందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ఏ అవకాశాన్ని షర్మిల వదులుకోవడానికి ఇష్టపడటం లేదని సమాచారం అందుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: