ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు ముగిసాయి. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చిన్నచిన్న గొడవలు మినహా అంతా ప్రశాంతంగానే సాగింది. ప్రస్తుతం ఎన్నికలు అయితే ముగిసాయి కానీ ప్రధానమైన లెక్కింపు అనేది ఉంది. దీని కోసమే ప్రతి ఒక్క అభ్యర్థి రెండు రాష్ట్రాల ప్రజలు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఎన్నో సర్వే సంస్థలు, ఎగ్జిట్ పోల్స్ ఇలా రకరకాల సర్వేలు బయటకు వస్తున్నాయి. ఇందులో కొన్ని సర్వేలు టిడిపికి సపోర్టుగా ఉంటే మరికొన్ని సర్వేలు వైసీపీకి సపోర్ట్ గా వస్తున్నాయి. ఏది ఏమైనా టఫ్ ఫైట్ నడిచింది అనేది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. కట్ చేస్తే ఎన్నికల కోసం 2023 నుంచే కసరత్తు మొదలుపెట్టిన నాయకులు ఎన్నికలు ముగిసే వరకు చాలా బిజీగా ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి