ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అనే చర్చ సైతం జరుగుతోంది. ఏపీ ఫలితాలపై వేర్వేరు సంస్థలు సర్వేలు చేశాయి. అయితే ప్రీ పోల్, పోస్ట్ పోల్ అంచనాల విషయంలో క్రెడిబిలిటీ ఉన్న కొన్ని సంస్థలలో జన్మత్ ఒకటి కావడం గమనార్హం. తెలంగాణలో కచ్చితమైన అంచనాలు వేసిన జన్మత్ ఏపీలో సైతం పర్ఫెక్ట్ గా అంచనా వేసిందని ఏపీ ప్రజలు చెబుతున్నారు.
 
ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని జన్మత్ ఎన్నికల పోలింగ్ తర్వాత వెల్లడించింది. వైసీపీ 93 నుంచి 96 స్థానాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని జన్మత్ లెక్కల ద్వారా వెల్లడవుతోంది. కూటమికి 77 నుంచి 79 స్థానాల్లో విజయం దక్కనుందని ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. ఏపీలో ఒకింత పోటాపోటీ ఉండబోతుందని జన్మత్ లెక్కలతో దాదాపుగా క్లారిటీ అయితే వచ్చేసింది.
 
అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండనుందని ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. 100కు పైగా స్థానాలలో ఏ పార్టీ విజయం సాధించదని జన్మత్ లెక్కలతో తేలిపోయింది. అయితే వైసీపీ మరోసారి బొటాబొటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని జన్మత్ అంచనా వేస్తుండటం సోషల్ మీడియా వేదికగా ఒకింత హాట్ టాపిక్ అవుతోంది. మెజార్టీ సర్వేలు వైసీపీదే అధికారమని వైసీకి తిరుగులేదని చెబుతున్నాయి.
 
ఆరు నూరైనా ఏపీలో వైసీపీదే అధికారమని జన్మత్ లెక్కలతో మరోసారి వెల్లడవుతోంది. వైసీపీ ఇప్పటికే జూన్ 9వ తేదీన ఉదయం వైజాగ్ లో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతోంది. మరికొన్ని ప్రముఖ సర్వే సంస్థలు సైతం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు. జగన్ మళ్లీ సీఎం అయితే మాత్రమే ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు మళ్లీ అమలవుతాయని చాలామంది నమ్ముతున్నారు.   జగన్ సీఎం కావాలని కొంతమంది వైసీపీ అభిమానులు పూజలు చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: