రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార మార్పిడి జరిగింది.. దూరమైన అధికారానికి దగ్గర కావడానికి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ - వైసిపి అధికార పార్టీలు అయిన టిడిపి - కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తూ ముందుకు వెళుతున్నాయి. వాస్తవంగా ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన పోరాటం చేయాలి ... అందులో తప్పులేదు .. కానీ కొత్త ప్రభుత్వాలు ఏర్పడి రెండు నెలలు కూడా కాకముందు నుంచే రాజకీయంగా పసలేని విమర్శలు చేస్తూ వైసీపీ - బీఆర్ఎస్ పార్టీలు ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఎంత కామెడీ అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండు నెలలు కూడా పూర్తవకుండానే రాష్ట్రంలో ప్రభుత్వమే రద్దుచేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ దేశ రాజధాని ఢిల్లీ దాకా వెళ్లి నిరసన తెలిపి నవ్వుల పాలయ్యారు వైసీపీ అధినేత జగన్ రెడ్డి .


పొరుగు రాష్ట్రంలో తమ మిత్రపక్షం వైసిపి ఢిల్లీ దాకా వెళితే మేము ఎందుకు ? వెళ్ళకూడదు అనుకున్నారో ఏమో కానీ బిఆర్ఎస్ నేతలు కేటీఆర్ - హరీష్ రావు కూడా ఢిల్లీ పర్యటన చేపట్టారు. అక్కడ కూడా వారిద్దరూ చాలా కామెడీగా తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు రావడం ఖాయ‌మ‌ని ప్రకటించి నవ్వుల పాలయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పోలు పోతుంది. తిరిగి బి ఆర్ ఎస్‌ అధికారంలోకి వస్తుంది అంటూ మైండ్ గేమ్ మొదలుపెట్టారు. మరి గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు .. ఎమ్మెల్యేలు .. ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకుని గులాబీ కండువా కప్పినప్పుడు కేటీఆర్ - హరీష్ రావుకు ఈ నీతి సూత్రాలు ఎందుకు గుర్తు రాలేదో వారే చెప్పాలి. ఏది ఏమైనా వైసీపీ - బీఆర్ఎస్ పార్టీలకు అధికారం పోవడంతో వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: