ఆంధ్రప్రదేశ్లోని గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ ఈ రోజున విడుదల చేశారు. ఇందులో 16,347 పోస్టులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల తేదీ 20-4-2025.. అయితే దరఖాస్తులు స్వీకరణ కూడా ఈ రోజు నుంచి మే 15వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలోనే పరీక్షలు జరగబోతున్నాయట. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

దరఖాస్తు స్వీకరణ విషయానికి వస్తే ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఉంటుంది.

హాల్ టికెట్లు రిలీజ్.. మే 30వ తేదీన.

పరీక్ష: CBT విధానంలో జూన్ 6వ తేదీ నుంచి జూలై ఆరవ తేదీ వరకు జరుగుతుందట.


ప్రాథమిక కీ: చివరి పరీక్ష ఎప్పుడు ముగుస్తుందో అప్పుడు రెండు రోజుల తర్వాత విడుదల చేస్తారట.


అభ్యంతరాలు స్వీకరణ: ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కీ విడుదలైన 7రోజుల వరకు తెలియజేయవచ్చు. ఇక ఫైనల్ కి జూలై 3 వారంలో విడుదల చేయడమే కాకుండా మెరిట్ లిస్టు జూలై చివరి వారంలో విడుదల చేసేలా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ని కూడా విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.


అలాగే అటు క్రీడా పాలసీలో భాగంగా 2024 -29 లో భాగంగా క్రీడా స్పోర్ట్స్ కింద  3 శాతం రిజర్వేషన్లను కలిపిస్తూ నోటిఫికేషన్ విడుదల ఈరోజు 10 గంటలకు ఉదయం చేయబోతున్నారు. అలాగే అటు ప్రభుత్వ, స్థానిక సంస్థలు, పోలీస్, ఎక్సేంజ్ ,అటవీ శాఖలలో కూడా 3 పర్సంటేజ్ క్రీడాకారులకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. 65 రకాల క్రీడాకారులను గుర్తించి నోటిఫికేషన్ విడుదల చేశారట. మొత్తానికి సీఎం చంద్రబాబు పుట్టినరోజు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: