అమరావతి ఉద్యమ మహిళ నేతగా పేరు సంపాదించింది సుంకర పద్మశ్రీ.. ఈమె వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నేత అయినప్పటికీ కూడా వైసిపి హయాంలో మూడు రాజధానుల విషయం పైన రైతుల తరఫున పోరాడింది. రాజకీయాల కంటే తనకు రైతుల ప్రయోజనాలు ముఖ్యమని నిరూపించింది. అయితే ఇప్పుడు తాజాగా అమరావతి విషయంలో సీఎం చంద్రబాబు నయవంచన చేస్తున్నారంటూ గతంలో కంటే రెట్టింపుగా నిరసనలను తెలియజేస్తూ ఉన్నది. అమరావతికి ఏకైక రాజధాని ఉండాలి అని అందుకోసం అవిశ్రాంతిగా పోరాటం చేస్తూనే ఉంది సుంకర పద్మ.


దీంతో ఈమెతో పాటుగా కొంతమంది మరి కొంతమంది  నేతలను కూడా సీఎం చంద్రబాబు గృహనిర్బంధం చేశారని ప్రశ్నించే గొంతుని ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందంటూ తాజాగా ఫైర్ అయ్యింది. ఏపీ సర్కార్కు సైతం తూటాలా లాంటి ప్రశ్నలు వేయడం జరిగింది.. ముఖ్యంగా గతంలో 34 వేల ఎకరాల భూమి తీసుకున్నారు. దానికి దిక్కులేదు? ఇప్పుడు మళ్లీ 40వేల ఎకరాలు ఏపీ సర్కార్ తీసుకున్నది అంటూ ఫైర్ అయ్యింది.. అసలు మంత్రి నారాయణ ఏం మాట్లాడుతున్నారో అసలు ఆయనకే అర్థం కాలేదని.. ప్రస్తుతం రైతులంతా కూడా దిక్కు తోచని స్థితిలోనే ఉన్నారని తెలియజేస్తోంది.


అమరావతి రాజధాని పైన ప్రధాన మోడీ సీఎం చంద్రబాబు నుంచి భూములు ఇచ్చిన రైతులకు రాజధాని పైన చట్టబద్ధత చేయిస్తారని ఆశగా చూశారు కానీ నిరాశన మిగిల్చారని ఫైర్ అయ్యింది. 2014లో శ్రీవారి పాదాల సాక్షిగా హామీ ఇచ్చిన మోడీ ఇప్పటికీ ఆ హామీలను నెరవేర్చలేదంటూ ప్రశ్నించింది? కూటమి అధికారంలోకి రావడానికి టిడిపి కారణం? మరెందుకు ప్రధానమోదిని సీఎం చంద్రబాబు బ్రతిమలాడుతున్నారంటూ ప్రశ్నించింది.. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డు  ఇచ్చారని విమర్శించారు.. మరి ఇప్పుడు అదే మోదీని దేవుడితో పోలుస్తున్నారు అంటూ ఫైర్ కావడమే కాకుండా పవన్ కళ్యాణ్ కు చాక్లెట్ ఇవ్వడం చూసి అందరూ నవ్వుకుంటున్నారని వెల్లడించింది.1500 కోట్లతో సభను పెట్టి పొగుడుకోవడం చేస్తున్నారని సిగ్గుగా లేదంటూ ప్రశ్నించింది పద్మశ్రీ. ఢిల్లీని మించిపోయి, సింగపూర్ ని మించిపోయి, జపాన్ని మించిపోయి రాజధాని అవుతుంది అంటున్నారు? మళ్ళీ శంకుస్థాపనలు చేసుకుంటూ పోతున్నారు అంటు ఫైర్ అయ్యింది. అప్పుడు జగన్ ని విమర్శించిన వారు ఇప్పుడు అంతకంటే పది రెట్లు ఎక్కువగా సంపాదించుకోవాలని ఆలోచనతోనే భూముల్ని సైతం ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారంటే ఫైర్ అయ్యింది సుంకర పద్మశ్రీ. ఇంత త్వరగా ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత రావడం ఇదే మొదటిసారి అంటూ విమర్శలు చేసింది పద్మశ్రీ .

మరింత సమాచారం తెలుసుకోండి: