తాజాగా మహిళల కోసం ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. ముఖ్యంగా మహిళా ప్రభుత్వ ఉద్యోగుల కోసం వివాహిత మహిళలకు ఇచ్చేటువంటి మెటర్నటీ లీవ్ సైతం మరింత పొడిగించింది ఏపీ ప్రభుత్వం. మెటర్నటీ లీవ్ 120 రోజుల నుంచి 180 రోజులకు సైతం పెంచారు అంతేకాకుండా ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ లీవ్ వర్తిస్తుందనే విధంగా నిబంధనను ప్రభుత్వం తొలగించినట్లు తెలియజేశారు. 180 రోజులు పెంచుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో చాలామంది మహిళలు ఆనందాన్ని తెలియజేస్తున్నారు.



కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా ఉద్యోగుల సమస్యల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. గతంలో కూడా ఎన్నికల ముందు చాలామంది నేతలు ఈ విషయం పైన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలు అంశాలను పరిశీలించిన తర్వాత మెటర్నటి లీవుని సైతం పొడిగించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న తరహాలోనే 180 రోజులపాటు లీవులను మహిళలకు సైతం ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం సన్నహాలు చూస్తోంది. ఎంతమంది పిల్లల్ని కన్న కూడా ఈ కండిషన్ యధావిధిగా వర్తిస్తాయట.
 

మహిళా ఉద్యోగుల వృత్తి వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకే ఇన్ని రోజులు సమయాన్ని ఇస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. ముఖ్యంగా వారు ఎదుర్కొని ఇబ్బందులు సమస్యల కారణంగానే ఇన్ని రోజులు సెలవులు ఇవ్వడంతో చాలామంది మహిళా ఉద్యోగులు కూడా సీఎం చంద్రబాబుకు పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో మహిళల కోసం మరిన్ని గుడ్ న్యూస్ చెప్పాలని అటు కూటమి నేతలతో పాటు ఉద్యోగులు కూడా తెలియజేస్తున్నారు.

ఇక ఇటీవలే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేయడానికి సన్న హాలు చేస్తున్నట్లు తెలియజేశారు. అందుకు సంబంధించిన అన్ని పరిశీలనలు సైతం ఆయా జిల్లాలలో ఉండేటువంటి అధికారులకు అప్పచెప్పినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: