
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై మజ్లిస్ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాల పై భారత బలగాలు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌ను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను .. మరో పహల్గాం లాంటి దాడులు జరగకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత ప్రభుత్వం సరైన బదులు ఇచ్చింది ... మళ్ళీ ఉగ్రదాడులు జరగకుండా పాకిస్తాన్ కు కఠినమైన గుణపాఠం చెప్పాలి. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలతో పాటు వారి మౌలిక సదుపాయాలు పూర్తిగా నాశనం చేయాలి. జైహింద్ అని ఓవైసీ తన ఎక్స్ లో రాసుకొచ్చారు.
ఇటీవల పహాల్గమ్ దాటిన సైతం వైసీపీ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న తాము ఈ విషయంలో మద్దతు ఇస్తామని అన్నారు. హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి .. మంత్రులు నేతలు ప్రజలతో కలిసి పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో కూడా ఓవైసీ పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఆయన భారత ఆర్మీ చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర కు పూర్తి మద్దతు ప్రకటించారు.