- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

తన మంత్రివర్గంలోని కొందరు మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి క్లాస్ ఇచ్చారని తెలుగుదేశం వర్గాలలో ప్రచారం జరుగుతుంది. రెండు రోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొల్లు రవీంద్ర - అనగాని సత్యప్రసాద్ - సుభాష్ వాసంశెట్టి - సవితమ్మ కొండపల్లి రాంప్రసాద్ రెడ్డి తో పాటు హోం మంత్రి అనిత లాంటి కొందరు మంత్రులను ప్రత్యేకంగా తన ఛాంబర్ లోకి పిలిచి వారితో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆ మంత్రుల శాఖల పనితీరుపై చంద్రబాబు సమీక్షించారని . . . కొన్ని విషయాలలో మంత్రులు అలసత్వంగా ఉండటం .. కొంత నిర్ల‌క్ష్యం లాంటి విషయాలను ఆయన తప్పుపట్టారని సమాచారం. ఇక కొందరు మంత్రుల నియోజకవర్గాల స్థాయిలో కూడా పనితీరు బాగోలేదని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది.


అందరినీ కలుపుకుని పోవటంలో నూ .. కూటమి నాయకులకు ప్రాధాన్యం ఇవ్వ‌డం లోనూ కొందరు మంత్రులు వెనుకబడినట్లు చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో తాను చేయించిన సర్వేల తాలూకు నివేదికలను కూడా ఆయన వారి ముందు పెట్టారని తెలిసింది. దీనిని సీఎం గట్టిగానే చెప్పారు. మంత్రులు పనితీరు మార్చుకోవాలని సూచనలు చేశారు. ప‌ని తీరు మార్చుకోక పోతే నా నిర్ణ‌యాలు వేరుగా ఉంటాయ‌ని కూడా సీఎం చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ నేపథ్యంలో నే కొందరు మంత్రులు అనూహ్యంగా బుధవారం మీడియా ముందుకు వచ్చి జగన్ తో పాటు వైసిపి నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: