
ఎమ్మెల్సీ కవిత చెప్పిన చెప్పకపోయినా కూడా తెలంగాణలో బిజెపి పార్టీ బలపడిందని వెల్లడించారు. కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు కూడా మొదలైందనే విధంగా ఎంపీ రఘునందన్ వెల్లడించారు. కవితను బయటకు పంపించడానికి కేటీఆర్ ,హరీష్ ఇద్దరు కూడా మీటింగ్ అయ్యారు అంటూ రఘునందన్ మాట్లాడారు.. తెలంగాణలో కవిత మరో షర్మిల కాబోతోందనే విధంగా పరోక్షంగా కామెంట్స్ చేశారు ఎంపీ రఘునందన్. ముఖ్యంగా కవిత రాసినటువంటి లేఖ ఆ రోజే కాంగ్రెస్ పార్టీకి చెందిన పేపర్, టీవీలలో విచ్చలవిడిగా వైరల్ గా మారాయి అంటూ ఎద్దేవా చేశారు.
దీన్ని బట్టి చూస్తూ ఉంటే కవిత కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విధంగా మాట్లాడుతున్నారు. ఈ డ్రామా వెనుక మొత్తాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారేమో అన్నట్లుగా పలువురు నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆ లెటర్ బయట పెట్టింది కేసీఆరా? కవితానా అనే సందేహం ఉన్నదంటూ బిజెపి నాయకులకు కూడా ఉంది అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కవిత లేక తో బిఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ డ్రామా మొదలయ్యిందనే విధంగా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయం పైన అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎవరు కూడా స్పందించకపోవడంతో పలు రకాల అనుమానాలకు దారితీస్తోంది.