
అయితే ఈ హత్యకు ముఖ్య కారణం టిడిపిలోని విభేదాలు.. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో టిడిపి ,వైసిపి మధ్య గొడవలు ఎక్కువగా ఉండేవట. ఆ సమయంలో వైసీపీ పార్టీకి చెందిన చింతా శివరామయ్య వర్గానికి చెందిన కొంతమంది టిడిపి పార్టీకి చెందిన తోట చంద్రయ్యను ఊరి మధ్యలోనే హత్య చేయడంతో ఈ విషయం చంద్రబాబు వరకు వెళ్ళాగా.. చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు.
అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కూడా పల్నాడులో టిడిపిలో రెండు వర్గాలుగా చీలిపోయాయి. అలా ఒక వర్గం వారు తోట వెంకయ్య నాయుడుకి సపోర్టివ్ గా ఉండగా మరొక వర్గం వారు జవిశెట్టి వెంకటేశ్వర్లకు సపోర్టివ్గా ఉన్నారట. గతంలో వైసిపి పార్టీలో ఉన్న శ్రీను అనే వ్యక్తి వెంకటరామయ్యతో కలిసి టీడీపీ పార్టీలోకి చేరారు. అలాంటి సమయంలోనే ఎమ్మెల్యే బ్రహ్మ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జీవిశెట్టి వెంకటేశ్వర్లు తమ గ్రామంలో ఫ్లెక్సీలను కట్టారు.. ఇదే అదునుగా చూసుకొని వైసీపీ నుంచి టిడిపి పార్టీలోకి వచ్చి న శ్రీను పైన వెంకటేశ్వర్లు వర్గం కూడా దాడి చేసి అతని కాలు విరగొట్టారట.. ఈ విషయంపై మరొక టిడిపి నేత వెంకట్రామయ్య వర్గం తట్టుకోలేక ప్లాన్ చేసి అటు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు ఫంక్షన్ కి వెళ్తూ ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొడవలితో నరికి చంపారట. దీంతో ఇప్పుడు మరొకసారి పల్నాడులో ఈ హత్య రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.