
ఇక పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీగా కొత్తగా నియమిత్తమయ్యారు నాగబాబు. పిఠాపురం కూడా జనసేన అడ్డాని చెప్పడంతో ఏపీ అంతట ఈ విషయం పెద్ద దుమారాన్ని రేపింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు అభిమానులు గెలిపించారని ఎవరి అండ లేదంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అప్పటి నుంచి టీడీపీ,జనసేన మధ్య పిఠాపురంలో ఒక వార్ నడుస్తూ ఉన్నది. అయితే ఇటీవలే మహానాడు ను కడపలో నిర్వహించారు. అక్కడికి పెద్ద ఎత్తున టిడిపి నేతలు పాల్గొన్నారు.
ఇలాంటి సమయంలోనే మీడియా వారిని పలకరించగా పిఠాపురం గ్రౌండ్ లెవెల్ రియాల్టీ గురించి వారు తెలియజేశారు. అందులో ఒక నాయకుడు పిఠాపురం అంతా కూడా టిడిపి మాయమే ఉందంటూ చెప్పుకొచ్చారు. టిడిపి ఇన్చార్జిగా ఉన్న వర్మ పొత్తులో భాగంగా తన సీటును త్యాగం చేయడంతోనే పవన్ కళ్యాణ్ గెలిచారు అంటూ తెలిపారు. వర్మ 25 ఏళ్లుగా పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, చాలా డబ్బులను కూడా ఖర్చు చేశారు పిఠాపురంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా ప్రజలను ,కార్యకర్తలను పేరు పెట్టి మరి పలకరించే అంత సన్నిహితం ఉందంటూ ప్రశంసించారు. పిఠాపురంలో టిడిపి బలం 80 శాతం ఉంటే జనసేన ది 20% ఉందంటూ తెలియజేశారు. మొత్తానికి మహానాడులో మరొకసారి వర్మ స్టామినా ఏంటో బయటపడింది అని అభిమానులు కార్యకర్తలు తెలుపుతున్నారు.