కూటమిలో భాగంగా సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా  ఎవరి మార్కు పాలనలో వార్ ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ పల్లె పండుగ, అడవి తల్లి బాట అలా ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇలా ప్రభుత్వంలో తనదైన స్టైల్ లో ముందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చిక్కులో ఉన్నట్లుగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం సమర్థించాలా ?లేకపోతే విభేదించాలా? అని తెలియక సతమతమవుతున్నారు.


ఇటివలే హోంశాఖ తీసుకున్న ఒక నిర్ణయం వల్లే పవన్ కళ్యాణ్ చిక్కుల్లో పడినట్టుగా కనిపిస్తోంది. తమ సొంత సామాజిక వర్గానికి చెందిన సమస్య కావడంతో ఇది చాలా సున్నితంగా మారుతోంది. మరి పవన్ కళ్యాణ్ తమ సామాజిక వర్గం పైన ఎలా స్పందిస్తారో అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారుతున్నది.. అసలు విషయంలోకి వెళితే 2014-19  మధ్యలో చంద్రబాబు అధికారంలో ఉండగా కాపు ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది ముఖ్యంగా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ చెప్పిన టిడిపి రిజర్వేషన్లు కల్పించకపోవడంతో ముద్రగడ పద్మనాభ రెడ్డి డైరెక్షన్లో తునిలో  భారీ ధర్నా చేపట్టారు.


అప్పట్లో ఈ ధర్నాకు వైసిపి కూడా మద్దతు పలికింది. అయితే కొంతమంది అల్లరి ముఖాల వల్ల ఎక్స్ప్రెస్ రైల్ ను తగలబెట్టారు. దీంతో చాలామంది పైన తుని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. సుమారుగా 161 మంది పైన కేసులు నమోదయ్యాయి. అప్పటినుంచి కాపు ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేశారు. కానీ 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో ఈ కేసులన్నీ కూడా ఉపసంహరించుకుంది. అలా కాపు నేతలకు విముక్తి కల్పించినట్లుగా మారింది. ఈ కేసులను కోర్టు కూడా కొట్టేసింది.


కానీ ఇప్పుడు మళ్లీ ఈ కేసులను రీఓపెన్ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. అయితే మళ్లీ ఇప్పుడు ఈ తీర్పు పైన అప్పీల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మళ్లీ కాపు నేతలు ఈ కేసులను ఎదుర్కోవలసి ఉన్నది. కూటమి ఎన్నికలలో కాపుల మద్దతుతో గెలిచిన పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు తీసుకొనే నిర్ణయం ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుందని నేతలు కార్యకర్తలు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎలా అధికమిస్తారో చూడాలి. ప్రస్తుతం అయితే ముద్రగడ పద్మనాభరెడ్డి, హరిరామ జోగయ్య వంటి వారు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఉన్నారు. వీటికి తోడు చాలామంది జనసేన నేతలు కూడా కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: