
అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది అయిన నేపథ్యంలో ప్రముఖ సర్వే సంస్థలు చేసిన సర్వే ఫలితాలు రాజకీయ నేతలను ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో కూటమి నుంచి 164 మంది అభ్యర్థులు విజయం సాధించగా వీళ్ళలో ఏకంగా 76 మంది ఓడిపోవడం పక్కా అని సర్వే ఫలితాలు వెల్లడించాయి. కేవలం 12 నెలల సమయంలోనే కూటమిపై ఈ స్థాయిలో వ్యతిరేకత ఉండటం పార్టీకి తీరని స్థాయిలో చేటు చేస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. మరోవైపు జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జనసేన పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు పవన్ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలపై ప్రత్యేక దృష్టి పెడితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సర్వే ఫలితాలు వైసీపీ శ్రేణులు పండుగ చేసుకునే విధంగా ఉన్నాయని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.
మరికొందరు మాత్రం అధికారంలో ఉన్న ఏ పార్టీపై అయినా వ్యతిరేకత సర్వసాధారణం అని ఇలాంటి సర్వేలను పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో కూటమీ సర్కార్ సంక్షేమ పథకాల దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఏకంగా 85 స్థానాల్లో గెలిచే ఛాన్స్ అయితే ఉంది.