అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద విషాద ఛాయల నుండి ఇంకా కోలుకోక ముందే మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది.  ఉత్తరాఖండ్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉత్తరాఖండ్ ఉలిక్కిపడింది . అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం కారణంగా 241 మంది  ప్రయాణికులు  అక్కడికక్కడే మృతి చెందారు.  కేవలం ఒక వ్యక్తి మాత్రమే బయటపడ్డాడు. ఇంకా ఈ ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలను వెలికి తీయలేదు . ఇంకా అక్కడ పరిస్థితి కంట్రోల్ లోకి రాలేదు . ఈ విషాద ఛాయలు జనాలు మర్చిపోకముందే ఇలాంటి మరొక హెలికాప్టర్ ప్రమాదం జరగడం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసేలా చేస్తుంది.

ఉత్తరాఖండ్లో ఆదివారం ఉదయం హెలికాప్టర్ కుప్పకూలిపోయినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది.  ఆ హెలికాప్టర్ డెహ్రాడూన్  నుంచి కేదార్ నాధ్  వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు జాతీయ మీడియా చెప్తుంది . ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నుంచి కేదార్ నాధ్ వెళుతున్న హెలికాఫ్టర్ గౌరీ కుండ అడవి ప్రాంతం లో సడన్గా కుప్ప కూలిపోయినట్లు తెలుస్తుంది . అయితే ఈ ప్రమాదం ప్రతికూల వాతావరణ కారణంగానే జరిగినట్లు అధికారులు చెబుతున్నారు .

హెలికాప్టర్ ప్రమాదం పై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు.  ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వార  స్పందిస్తూ "రుద్ర ప్రయాగ జిల్లాల్లో హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఇది చాలా విషాదకరం . రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.  ప్రయాణికులు అందరి బధ్రత కోసం దేవుడుని ప్రార్థిస్తున్నాను " అంటూ చెప్పుకొచ్చారు . ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన  పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది . బ్యాక్ టు బ్యాక్ ఇలా భారత్లో ఘోర ప్రమాదాలు జరుగుతూ ఉండడం అందరికీ ఏదో బ్యాడ్ జరగబోతున్నట్లు సూచిస్తుంది.  ఇదే విషయాన్ని ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!!
 





మరింత సమాచారం తెలుసుకోండి: