భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ సిస్టం అనేది ఉన్నది. ఎవరి క్యాస్ట్ ఏమిటి ..? ఎవరికి ఏ జాబ్ లో ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంది ..? అనేది స్పష్టంగా జాబ్ నోటిఫికేషన్ లో ఉంటుంది. అలాగే మహిళలకు ఎంత రిజర్వేషన్ అనేది కూడా అందులో స్పష్టంగా పేర్కొనబడి ఉంటుంది. దాని ప్రకారం నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ నోటిఫికేషన్ కి అనుగుణంగా ఉద్యోగాల పంపిణీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తాజాగా సుప్రీం కోర్టు లో కూడా రిజర్వేషన్ సిస్టంను తీసుకువచ్చారు. కాకపోతే జడ్జి లకు మాత్రం రిజర్వేషన్ అనేది లేదు. మరి సుప్రీం కోర్టు లో ఎవరికి రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయి ..? ఎంత శాతం ఇవ్వబడ్డాయి ..? అనేది తెలుసుకుందాం.

సుప్రీం కోర్టు లో పని చేస్తున్న కొంత మంది కి ప్రత్యక్ష నియామకంలో తొలి సారి ప్రమోషన్లలో రిజర్వేషన్ ప్రవేశ పెట్టారు. రిజిస్టార్లు , సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ , అసిస్టెంట్ లైబ్రరీయన్లు , జూనియర్ కోర్టు అసిస్టెంట్ , ఛాంబర్ అటెండెంట్ లకి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఇందులో భాగంగా ఆ ఉద్యోగుల నియామకం, పదోన్నతులలో ఎస్సీలకు 15 శాతం , ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లను అమలు పరుస్తారు. ఈ మేరకు జూన్ 24 న సుప్రీం కోర్టు ఉద్యోగులందరికీ సర్కులేట్ జారీ చేశారు. ఇక ఈ సర్కులేట్ ప్రకారం ప్రస్తుతం సుప్రీం కోర్టు లో పని చేస్తున్న వారికి రిజర్వేషన్లు దక్కనున్నాయి. దానితో వారు ప్రమోషన్లు పొంది అత్యున్నత స్థాయికి చేరే అవకాశం కూడా ఉంది. ఇకపోతే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కేవలం సుప్రీం కోర్టు లో పని చేస్తున్న కొన్ని స్థాయిల వారికే వర్తిస్తుంది. జడ్జిలకు ఈ రిజర్వేషన్ ప్రక్రియ వర్తించదు.

మరింత సమాచారం తెలుసుకోండి: