
1. స్మార్ట్ మీటర్లు : రాష్ట్రంలో సాధారణ విద్యుత్ వినియోగించే గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియ ఎంతో సైలెంట్ గా నడుస్తుంది .. దీనిపై పెద్ద ఎత్తైన ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వస్తుంది. ఆదానీ కంపెనీ నుంచి వస్తున్నాయని కూడా అంటున్నారు నేరుగా ప్రస్తుతం ఉన్న మీటర్లను మార్చి కొత్త మీటర్లు పెడుతున్నారు .. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతవస్తున్న ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదు .. మరోపక్క నిన్న మొన్నటి వరకు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న కామ్రేడ్లు ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు.. స్మార్ట్ మీటర్ల వ్యవహారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి ఉద్యమాలు కూడా చేస్తున్నారు .
2. భూ సేకరణ: రాజధాని ప్రాంతంలో ఇప్పటికే సమీకరించిన 34 ఎకరాలకు తోడుగా మరో 44వేల ఎకరాలను తీసుకోవాలని ప్రభుత్వ లక్ష్యం .. కానీ ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది .. గతంలో ఇచ్చిన రైతులకు ఇప్పటికీ ఎలాంటి న్యాయం చేయలేదని .. రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ముందుగా వారికి న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు ఆ క్రమంలోని కొత్తగా భూమిని ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదు .. అయితే ప్రభుత్వ మాత్రం గట్టిగా ఉంది దీనిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని చెబుతుంది .. కానీ చంద్రబాబు జోక్యం చేసుకొని రైతులతో మాట్లాడితే తీరిపోయే సమస్యను పెద్దది చేసుకుంటున్నారు .
3.ఇండోసోల్ వ్యవహారం: ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ఇండోసోల్ కంపెనీకి 4500 ఎకరాలకు భూములను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది .. సౌర విద్యుత్ సంస్థను ఏర్పాటు చేసుకునే ప్రతిపాదన నేపథ్యంలో ఇండోసోల్‌కు ఈ భూమిని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది .. అయితే గతంలో వ్యతిరేకించిన సంస్థకు ఈ భూములు ఇవ్వటాన్ని ఒకవైపు ప్రతిపక్షాలు , వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే . వీరితోపాటు రైతులు నుంచి కూడా తీవ్ర వ్యతిరేకితే వస్తుంది .. తమ ప్రాణాలైనా ఇస్తామని చెబుతున్న రైతులు భూములు మాత్రం ఇచ్చేది లేదంటున్నారు .. ఈ ఇష్యూ కూడా రాష్ట్రస్థాయిలో హాట్ టాపిక్ గా మారింది .. ఇలా మొత్తంగా రైతులు సాధారన ప్రజలు మాత్రం ప్రస్తుతం ఈ విషయాలపై తీవ్ర వ్యతిరేకతతో రగిలిపోతున్నారనేది మాత్రం నిజం .. ఇక మరి ఈ విషయంలో చంద్రబాబు జోక్యం అనేది తప్పనిసరి .