టిబెట్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవడం తగదు అని చైనా హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల దలైలామా వారసుడు విషయంలో జరుగుతున్న విషయంలో ద‌లైల‌మా మాట్లాడుతూ తన వారసత్వం కొనసాగుతుందన్నారు. వార‌సుడి ఎంపిక ప్రక్రియ కొన‌సాగుతుంద‌ని.. గాడెన్ ఫ్రోడ్రాంగ్ ట్రస్టు మాత్రమే చేస్తుందని ... ఈ విషయంలో ఎవరికీ జోక్యం చేసుకునే అవకాశం లేదని పరోక్షంగా ఆయనకు తేల్చి చెప్పారు. అయితే తాజాగా దలైలామా 90 వ పుట్టినరోజు సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రోమియో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఐక్యత - శాంతి - కరుణ ప్రచారం చేస్తున్నందుకు దలైలామాను ప్రశంసించారు. ఈ సందర్భంగా టిబెట్ ప్రజలకు తమ ఆధ్యాత్మిక నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ .. మతపరమైన గుర్తింపు కాపాడుకునే హక్కు వారికి ఉంటుందన్నారు.


అయితే ఈ వ్యాఖ్యలను సహించలేని చైనా మండిపడింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ దలైలామా మత ముసుగు లో చైనా వ్యతిరేక ఏర్పాటు వాద‌ కార్యక్ర‌మాల్లో పాల్గొంటున్నారు .. ఆయన కు టిబేట్ ప్రజలకు ప్రాథినిత్యం వహించే ... ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించే హక్కు లేదన్నారు. ఇది సున్నితమైన అంశం .. అమెరికా జోక్యం చేసుకోవడం తగదు .. అమెరికా ఏర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. ఇక దలైలామా వారసుడు ఎంపిక నిర్ణయం ఆయన చేతుల్లోనే ఉందని .. కేంద్రమంత్రి కిర‌ణ్ రిజిజు తెలిపారు. వార‌సుడి విష‌యంలో జోక్యం చేసుకోవడం తగదంటూ భారత్‌పై చైనా వ్యాఖ్యలు చేసింది. అయితే మత విశ్వాసాలు.. ఆచారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోమని భారత్ స్పష్టం చేసింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: