తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హిందువులు సైతం ఎంతో పవిత్ర దేవాలయంగా భావిస్తూ కొలుస్తూ ఉంటారు.తిరుమల తిరుపతి అనేది దేవస్థానం ఏమి సత్రం కాదు.. దేవస్థానంలో 1000 కి పైగా ఇతర మతస్తులైన వారు ఉన్నారు. అయితే వారికి స్వామి మీద ఎలాంటి విశ్వాసం నమ్మకం లేదు.. అలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం ఎందుకు ఇచ్చారు?వారు ఎందుకు ఇంకా ఉద్యోగాలలో కొనసాగుతున్నారు అంటూ కేంద్రమంత్రి  బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు.. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన సనాతన అనుగుణంగా కూడా వివరించాలని చెప్పి ఆలోచన వారికి లేదని మాట్లాడారు.



అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి.. వాళ్లని కొనసాగించడం ఏంటి. ఎప్పుడు ఒకసారి మార్పు జరగాలి.. గతంలో నుంచి మేము ఉన్నాము మేము ఏమి చేయలేమంటే ఎలా అంటే టీటీడీ నేతలను ప్రశ్నించారు బండి సంజయ్. ఇటువంటి పద్ధతి మంచిది కాదని హెచ్చరించారు. భక్తులకు ఎన్ని సౌకర్యాలు కల్పించిన అభివృద్ధి చేసిన కూడా ఇతర మతస్తులు ఈ దేవాలయాలలో ఉండడం వల్ల వాళ్ల ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే అవి బయటికి రాకపోవచ్చు .. ఇది అన్ని మతాలకు స్థానం కల్పించడానికి సత్రం కాదు అంటూ ఫైర్ అయ్యారు.


అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ధూప దీప నైవేద్యాలకు నోచుకోలేనటువంటి ఆలయాలను పురాతనమైన వంటి వాటిని టీటీడీ అభివృద్ధి చేయాలంటూ సూచించారు. తిరుమలలో నిజమైన భక్తి చిత్తశుద్ధి ఉండే వారికి మాత్రమే అవకాశాలు కల్పించాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. అన్య మతస్తులపైన సమగ్ర విచారణ జరిపిన తర్వాతే వారి పైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. టీటీడీ అనేది ఏ ఒక్కరి ఆస్తి కాదు హిందువులందరికీ అంటూ తెలియజేశారు. సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండాలంటే వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: