అమరావతి నగరానికి మరో పెద్ద విద్యా గౌరవం దక్కింది. దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటైన BITS Pilani (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) , అమరావతిలో కొత్త క్యాంపస్ ను ఏర్పాటు చేయబోతోంది . వెంకటపాలెం గ్రామం వద్ద వెంకటేశ్వర ఆలయం సమీపంలో 35 ఎకరాల స్థలాన్ని BITS యాజమాన్యం ఎంపిక చేసింది . ఈ విషయాన్ని బిర్లా గ్రూప్ చైర్మన్ కూమార మంగళం బిర్లా స్వయంగా ప్రకటించారు .


ఈ క్యాంపస్ ప్రాజెక్ట్‌కి రూ.1,000 కోట్లు మొదటి దశలో ఖర్చు చేస్తారు. తదుపరి దశ లో మొత్తం పెట్టుబడి రూ. 3,200 కోట్లుకు చేరుతుంది. మొదటి దశలో 3,000 మంది విద్యార్థులకు , రెండవ దశలో 7,000 మంది కి పైగా విద్యార్థుల కోసం సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి . AI+ క్యాంపస్ స్పెషాలిటీలు : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డేటా సైన్స్ , రోబోటిక్స్ , కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ , సైబర్-ఫిజికల్ సిస్టమ్స్‌ వంటి అత్యాధునిక కోర్సులు . అలాగే  ఇంటర్నేషనల్ యూనివర్సిటీలతో జాయింట్ PhD ప్రోగ్రామ్స్. ఇండస్ట్రీలో ప్రాక్టికల్ అనుభవం కోసం ఇంటర్న్‌షిప్‌లు, రియల్-వరల్డ్ ప్రాజెక్ట్స్. మాస్టర్స్ డిగ్రీలు – AI, ML, ఇన్నోవేషన్ & స్ట్రాటజీ.



సస్టైనబుల్ క్యాంపస్ ఫీచర్లు: 100% రీసైకిల్ వాటర్ వాడకం , సోలార్ పవర్ , ఎనర్జీ సేవింగ్ లైటింగ్,  రీసెర్చ్ సెంటర్లు, గ్లోబల్ కొలాబరేషన్ జోన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హబ్‌లు, BITS Pilani క్యాంపస్‌లో అడ్మిషన్లు 2027 నుండి ప్రారంభమవుతాయని అంచనా. అమరావతిలో ఇప్పటికే SRM, VIT, AIIMS, NID, అమృత విశ్వవిద్యాపీఠం, XLRI, NLU, CITD వంటి పెద్ద విద్యా సంస్థలు స్థిరపడిన నేపథ్యంలో, BITS Pilani వంటి సంస్థ రావడం రాష్ట్ర విద్యా రంగ అభివృద్ధికి పునాది వేసినట్లే .



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: