
జంపింగ్ చేయటం ఎప్పుడు పెద్ద అయితే పొలిటికల్ జంపింగ్‌లు మాత్రం ఎప్పుడూ కానీ రిస్కు కావు. ఎంత పెద్ద జెమ్ చేస్తే అంత కలిసి వస్తుందా ? లేదా అని దూకేస్తారు. అసలు విషయానికొస్తే జీవీఎంసీలో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. గత మార్చిలో కూటమి పెద్దలు అవిశ్వాసం పెట్టి వైసిపి మేయర్ ను దించి వేశారు. వైసీపీకి మొత్తం 58 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 27 మంది కూటమి వైపు పరుగులు తీశారు. వీరిలో ఎక్కువ మంది టీడీపీలో చేరితే జనసేనలో కొందరు .. బిజెపిలోకి కొందరు సర్దుకున్నారు. వీరంతా ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన ఆ పార్టీకి చెందిన మేయర్ ని దించేసి కూటమికి జై కొట్టారు. అలా జీవీఎంసీ పీఠం మీద టిడిపి మేయర్ కూర్చున్నారు. అయితే ఇప్పుడు వారికి వైసీపీ నుంచి షోకాస్ నోటీసులు జారీ అయ్యాయి. తమ పార్టీ సింబల్ మీద గెలిచి ఓటమికి ఎలా ఓటు ? వేస్తారని వారి మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారికి వైసీపీ అప్పట్లోనే ఫిర్యాదు చేసింది.
దీంతో కలెక్టర్ ఈ 27 మందికి నోటీసులు పంపించారు. వైసీపీ జారీ చేసిన అభివృద్ధి కూటమి మేర అభ్యర్థికి ఎందుకు ? ఓట్లు వేశారు. వారం రోజుల లోగా వివరణ ఇవ్వాలని షాకాజ్ నోటీసుల్లో కోరారు. వారం రోజులలో ఆన్సర్ రాకపోతే తదుపరి నోటీసులు ఇవ్వటం జరగదని చర్యలు తీసుకుంటామని అందులో స్పష్టం చేశారు. దీంతో జంపింగ్ కార్పొరేటర్లలో టెన్షన్ మొదలైంది. కార్పొరేటర్ గా ఒక్కొక్కరికి పదవీకాలం ఇంకా ఎనిమిది నెలలకు పైగా ఉంది. ప్రభుత్వం అధికార పార్టీ కార్పొరేటర్లుగా ఉంటే ఏదో ఒకటి చేసుకోవచ్చని ఆశపడి పార్టీ మారిన వారి మెడ మీద ఇప్పుడు అనర్హత కత్తి వేలాడుతోంది. మరి దీని నుంచి వారు ఎలా తప్పించుకుంటారో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు