
అమరావతి రైతులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రాగా దీని వల్ల రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని, అప్పటికే అమరావతిలో చేసిన పెట్టుబడులు వృధా అయ్యాయని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైసీపీ ఫెయిల్ అయిందని కూడా కామెంట్లు వినిపించాయి. పోలవరం ప్రాజెక్టు పనులు తీవ్ర జాప్యం జరిగాయని, దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లంచాలు అందాయని ఛార్జిషీటులో పేర్కొనడం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే హరిహర వీరమల్లు గురించి వైసీపీ సొంత ఛానల్ లో నెగిటివ్ ప్రచారం జరగడం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశం అయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు వైసీపీకి మైనస్ అయ్యాయి.
వైసీపీలో పార్టీకి మేలు చేసే నేతల కంటే చేటు చేసే నేతలు ఎక్కువగా ఉండటం గమనార్హం. జగన్ మినహా ప్రజల్లో ఆ స్థాయి పాపులారిటీ ఉన్న నేతలు లేకపోవడం, సొంత కుటుంబ సభ్యులే జగన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరచడం జగన్ కు మైనస్ అయింది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు మారతాయేమో చూడాల్సి ఉంది. వైసీపీ పరిస్థితులు ఎప్పటికి మారతాయో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు