
వైసిపి అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇది వైసిపి పార్టీకి ఓటమే కాకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో టిడిపి పార్టీ పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. దీంతో వైసిపి పార్టీ అక్కడ డిపాజిట్ కూడా కోల్పోయింది.. ఈ ఎన్నికలను రెండు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపించింది. అయితే చివరికి టిడిపి పార్టీ పులివెందులలో గెలిచింది.
ఒంటిమిట్ట, పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికలు ఏపీ అంతట కూడా చాలా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఫలితాల కోసం చాలామంది ఎదురు చూశారు. అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా ఈ ఎన్నికలు నువ్వా నేనా అనే తరహాలో జరిగాయని చెప్పవచ్చు. పులివెందులలో పోలింగ్ రోజున చాలా అవకతవకలు జరిగాయని ఫిర్యాదు రావడంతో ఈసి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం కూడా నిన్నటి రోజున 3,14 వ కేంద్రాలలో రీపోలింగ్ ని కూడా నిర్వహించారు. అయితే ఇప్పుడు వెలువడిన ఫలితాలతో టిడిపి నేతలు సంబరపడుతున్నారు. ఇక ఒంటిమిట్టలో ఏ పార్టీ గెలుస్తుందనే విషయంపై ఎదురుచూస్తున్నారు. పులివెందులలో వైసీపీ కంచుకోట ను బద్దలు కొట్టాలని చూసిన టిడిపి అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను రచించింది.