
తరువాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ భేటీ కావడానికి సన్నాహాలు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పెట్టుబడుల సాధన వంటి అంశాలపై ప్రత్యేక చర్చ జరగనున్నట్టు లోకేష్ వెల్లడించారు. ఏపీని పెట్టుబడుల హబ్‌గా మార్చడం తన ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. పెట్టుబడిదారుల విశ్వాసం పెంచేందుకు కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామి సహకారం కోరారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగార అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆయనను అభ్యర్థించారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తోనూ లోకేష్ చర్చలు జరిపారు. అమరావతి రైల్వే లైన్ కేటాయింపు, విశాఖ – విజయవాడ మెట్రో ప్రాజెక్టుల కోసం కేంద్రం చూపుతున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని రైల్వే ప్రాజెక్టులు ఏపీకి మంజూరు చేయాలని ఆయన కోరారు.
మంగళవారం నాడు కూడా ఢిల్లీ పర్యటన కొనసాగించనున్న లోకేష్, పలు పారిశ్రామిక వేత్తలతో భేటీలు పెట్టుకున్నారు. అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు ఏపీకి రాబట్టే క్రమంలో P-4 వంటి ప్రాజెక్టులపై ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటన మొత్తాన్ని ఆయన "ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా మలచే మిషన్" అని స్వయంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మొత్తం మీద నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో చూపిస్తున్న చురుకుదనం ఆయనను తండ్రి తరహాలోనే రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడే నాయకుడిగా మలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటన ఫలితాలు ఏపీ భవిష్యత్తు పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు కీలకంగా మారవచ్చని అంచనా.