హైదరాబాద్ కూకట్పల్లిలో ఇటీవలే ఒక 12 ఏళ్ల బాలిక పదవ తరగతి చదువుతున్న విద్యార్థి దారుణ హత్య చేసిన ఘటన పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ కేసులో పలు సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మర్డర్ జరిగిన రోజున ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వర్క్ ఫ్రం హోం చేస్తున్న సమయంలో ఆ బాలుడిని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బాలుడు పైన అనుమానం వచ్చి విచారించారు. అయితే బాలుడు అనంతరం పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఇంటికి వెళ్లి మరి విచారించారు.


దీంతో ఆ బాలుడు ఇంట్లో బట్టలు ,లెటర్, కత్తి వంటివి కనిపించడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ బాలుడు ఎక్కువగా హర్రర్ సినిమాలు చూసే ఈ హత్య పాల్పడినట్లు సమాచారం. హత్య జరిగిన రోజు మూడుసార్లు గట్టిగా డాడి  అని పిలిచినట్లుగా  ఆ బాలుడు పోలీసులకు  తెలియజేశారట. అయితే అలా చెప్పడం వెనుక తన వైపు ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండేందుకు ఇలా చెప్పినట్లుగా తెలుస్తోంది.


బాలికను హత్య చేయడానికి ముఖ్య కారణం ఆ బాలుడు దొంగతనం చేయడానికి వెళ్ళగా ఆ బాలిక చూడడం వల్లే చంపినట్లుగా తెలియజేస్తున్నారు అధికారులు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పదవ తరగతి చదువుతున్న ఆ బాలుడు ఆ బాలిక ఇంట్లోకి వెళ్లి రూ.80 వేల రూపాయలు దొంగలించారట. ఆ సమయంలోనే 12 ఏళ్ల బాలిక చూడడంతో వెంటనే పీకపిసికి చంపేశానని.. ఆ తర్వాత కత్తితో దారుణంగా పొడిచి పారిపోయారట.. అయితే ఎప్పుడు దొంగతనం చేయాలి? ఎలా చేయాలి? అనేది ముందుగానే ఆ బాలుడు ప్లాన్ చేసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.



ముఖ్యంగా దొంగతనానికి సంబంధించి ఇంటర్నెట్లో కొన్ని వివరాలను కూడా సేకరించి మరి పేపర్లో రాసుకున్నారట. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు కంప్లీట్ ఇవ్వడం వల్లే దర్యాప్తులో ఈ విషయం బయటపడింది. మొదట ఆ బాలిక ఇంటిపై పోర్షన్లో సంజయ్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నారు. అయితే అతని మీద పోలీసులకు అనుమానం వచ్చి విచారించినప్పటికీ తాను హత్య చేయలేదని తెలియజేశారు. చివరికి పోలీసులు మరొక యాంగిల్ లో విచారణ చేపట్టగా అసలు మిస్టరీ బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: