2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదుర్కొన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తన రాజకీయ జీవితాన్ని మళ్లీ రీబిల్డ్ చేసుకోవడానికి ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఓటమి తర్వాత వెనక్కి తగ్గకుండా, పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తదుపరి ఎన్నికల్లో అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. జగన్ ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా, కూటమి ప్రభుత్వాన్ని ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. తన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను తిరిగి బలంగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా "జగన్ మోహన్ రెడ్డి తనకు కలిగిన ఓటమి షాక్‌ను వ్యూహాత్మకంగా ప్లాన్‌గా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు" అని అభిప్రాయపడుతున్నారు.


రీసెంట్‌గా కడప జిల్లా పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో జగన్ మమేకమయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఆయన పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకోగానే స్థానిక ప్రజలు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆయనను కలిశారు. కూటమి ప్రభుత్వపు నిర్ణయాలు, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలను వారు జగన్ ముందు వివరించారు. జగన్ కూడా ఓపిగ్గా ప్రతి ఒక్కరి సమస్యలు విని, వారికి భరోసా ఇచ్చారు. "నేను మీ వెన్నంటి ఉంటాను, మీరు పడుతున్న కష్టాలకు త్వరలోనే పరిష్కారం చూపిస్తాను" అని ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనపై మండిపడుతూ, "ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది, అనవసరంగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. ఈ అన్యాయాలను తట్టుకోలేం" అని మండిపడుతూ టిడిపి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.



వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ పలువురు జగన్ వద్ద వాపోయారు. దీనికి స్పందించిన జగన్, "ఎవరూ భయపడకండి. టిడిపి చేస్తున్న అరాచకాలకు చెక్ పెట్టే సమయం దగ్గరలోనే ఉంది. ఇకపై వారి అహంకారాన్ని భరించలేం" అని చెప్పుకొచ్చారు. అదేవిధంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి, "పోరాట పందాలు ఎంచుకొని ముందుకు సాగాలి. మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, పార్టీ తేడాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేశాం. అదే నిజమైన వైఎస్ఆర్ సీపీ పాలన" అని గుర్తు చేశారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.



ఆయన దూకుడు మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. "జగన్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంపై ఎంత దాడి చేశారో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అదే స్థాయిలో అధికారపక్షాన్ని దెబ్బతీస్తున్నారు" అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టిడిపిని తక్కువ చేసి, ఎక్కడైనా విమర్శించడానికి ఉన్న ఏ అవకాశం వదులుకోవడం లేదని మాట్లాడుకుంటున్నారు. "చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం" అనే సామెతను అప్లికెబుల్ చేస్తూ జగన్ ఎక్కడికి వెళ్లినా టిడిపిపై తీవ్ర విమర్శలు చేస్తూ, కూటమి ప్రభుత్వ పనితీరును తప్పుపడుతున్నారు అని మండిపడుతున్నారు.  ఈ అన్ని పరిణామాలను పరిశీలిస్తే, జగన్ తన తదుపరి ఎన్నికలకు భారీ స్కెచ్ వేసే ప్రయత్నంలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు కూడా "జగన్ ఇప్పుడు సాధారణ రాజకీయాలతో ఆగిపోవడం లేదు, కొత్త స్ట్రాటజీతో గేమ్ మార్చే ప్రయత్నంలో ఉన్నాడు" అని అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో అధికార పక్షం – ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ జగన్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, తన తెలివితేటలతో రాజకీయ చెస్‌బోర్డు పై మాస్టర్ ప్లాన్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్లీ గేమ్ చేంజర్‌గా మారతారా అన్నది చూడాలి..??

మరింత సమాచారం తెలుసుకోండి: