
జియో 9 ఏళ్ల జర్నీ – దుమ్ము రేపిన డిజిటల్ రివల్యూషన్ .. 2016లో ఎంట్రీ ఇచ్చిన జియో, కేవలం కొన్ని నెలల్లోనే పోటీదారులన్నింటినీ పక్కన పడేసింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా లాంటి దిగ్గజాలు కూడా షాక్ అయ్యాయి. డేటా రేట్లు ఒక్కసారిగా పతనం అయ్యి, ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ చేరింది. ఒకప్పుడు 1GB డేటా కోసం వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ జియో వచ్చాక, అదే 1GB డేటా కొన్ని రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. ఈ డిజిటల్ రివల్యూషన్ వల్లే నేడు ఇండియా “డేటా కింగ్డమ్”గా మారింది.
9వ వార్షికోత్సవం ఆఫర్లు – కస్టమర్లకు బంపర్ ట్రీట్స్, ఇప్పుడు 9వ వార్షికోత్సవం సందర్భంగా జియో కస్టమర్ల కోసం పండగే! రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ – అదనంగా ఫ్రీ డేటా, ప్రత్యేక బెనిఫిట్స్, జియో ఎయిర్ ఫైబర్ హోమ్ రూ.1200 ప్లాన్ – హై స్పీడ్ ఇంటర్నెట్‌తో కొత్త సర్ప్రైజ్‌లు, వీకెండ్ డేటా ఫ్రీ, 5g బూస్టర్స్ – ఎప్పటికీ ఎంజాయ్ చేసే ఫెసిలిటీస్ .. ఈ ఆఫర్లు కేవలం కస్టమర్లను ఆకట్టుకోవడమే కాదు… పోటీదారులకు వార్నింగ్ కూడా. “మేము మార్కెట్ బాస్” అన్నట్టే జియో ప్లాన్స్ ఉన్నాయి.
భవిష్యత్ ప్లాన్స్ – IPOతో దుమ్మురేపే జియో .. ముకేష్ అంబానీ ఇప్పటికే హింట్ ఇచ్చారు. రాబోయే రెండు సంవత్సరాల్లో జియో IPO కూడా లాంచ్ అవ్వొచ్చు. IPO వస్తే షేర్ మార్కెట్‌లో హంగామా ఖాయం. పెట్టుబడిదారులు రెడీగా క్యూల్లో నిలబడే సీన్ ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే కొత్త టెక్నాలజీలు, సూపర్ స్పీడ్ 5g సర్వీసులతో జియో మరిన్ని రికార్డులు సృష్టించబోతోంది. “జియో ఉన్న చోట, గ్యాప్ ఉండదు!” 50 కోట్ల యూజర్లతో జియో ఇప్పుడు కేవలం టెలికాం కంపెనీ కాదు – ఇది ఇండియా డిజిటల్ బాస్. ఆఫర్లతో కస్టమర్లను, IPOతో ఇన్వెస్టర్లను, 5Gతో యువతను దూసుకుపోబోతోంది.