భారతదేశ ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబులను సంస్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి కానుక అని ప్రధాని మోదీ ప్రకటించినప్పటికీ, ముందుగానే అమలు చేయాలని నిర్ణయించారు. ఏ వస్తువులపై పన్ను తగ్గుతుందన్న జాబితా కూడా విడుదల చేయడంతో వినియోగదారులు ఆనందంలో మునిగిపోయారు. ఆగస్టు 15 సందర్భంగా ప్రధాని మోదీ ఈ జీఎస్టీ సంస్కరణల గురించి చెప్పారు. “దీపావళికి మంచి వార్త” అంటూ క్లూస్ ఇచ్చారు. వెంటనే కేంద్రం నుంచి సమాచారం లీక్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా కార్ల కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోయాయి. “కొద్ది రోజులు ఆగితే లక్ష రూపాయల వరకు మిగులుతుంది” అన్న లెక్కతో వినియోగదారులు వెనక్కి తగ్గారు.

దీంతో మార్కెట్ నిలిచిపోవడంతో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా జీఎస్టీ తగ్గింపు ముందుగానే అమల్లోకి వస్తోంది. ఇప్పటివరకు జీఎస్టీ పేరు చెప్పి వినియోగదారులపై రెండు విధాలుగా భారాన్ని మోపారని విమర్శలు వచ్చాయి. ఎంఆర్పీతో పాటు అదనంగా జీఎస్టీ వసూలు చేయడంతో ధరలు పెరిగిపోయాయి. “అత్యవసర వస్తువులపై కూడా ఇంత పన్నా?” అనే ప్రశ్నలు రేకెత్తాయి. ముఖ్యంగా ఆరోగ్య బీమాపై 18 శాతం జీఎస్టీ ఉండటంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కనిపించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం పన్ను శ్లాబులను కుదిస్తూ, తగ్గిస్తూ సంస్కరణలు చేపట్టింది. నిత్యావసరాలపై పన్ను తగ్గడం వల్ల ప్రతి కుటుంబానికి ఆదా అవుతుంది. ఇది వినియోగదారులకు ఊరటను ఇస్తుంది. కానీ ఒకవైపు ప్రశ్న తలెత్తింది. జీఎస్టీ తగ్గిస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందా? అని. ఇక్కడ ఆర్థిక లెక్కలు వేరే మాట చెబుతున్నాయి.

పన్నులు తగ్గించడంతో వినియోగం పెరుగుతుంది. వినియోగం పెరిగితే మొత్తం ఆదాయం మళ్లీ అదే స్థాయిలో కొనసాగుతుంది. అంటే ప్రజలకు కూడా ఊరట, ప్రభుత్వాలకు కూడా నష్టం ఉండదు. అదనంగా మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి నెలకు దాదాపు రెండు లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వస్తోంది. రాష్ట్రాలకు కూడా అదే స్థాయిలో వస్తోంది. దీన్ని కాపాడుకోవడమే కాకుండా, వినియోగాన్ని పెంచుకోవడం కోసం కేంద్రం ఈ సంస్కరణలు చేపట్టిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.మొత్తానికి మోదీ తీసుకున్న ఈ జీఎస్టీ సంస్కరణలు రెండు విధాలుగా ఉపయోగపడతాయి. ఒకవైపు ప్రజలకు ఊరట ఇస్తే, మరోవైపు ప్రభుత్వానికి ఆదాయంలో నష్టం రాదు. ఇది నిజంగానే ఒక మోదీ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: