
ఇప్పుడు తాజాగా మూడో విడత కోసం దరఖాస్తు కోరుతోంది.. ఎవరైనా అర్హులైన పిల్లలు ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. కేంద్రంలో 60 శాతం రాష్ట్రం నుంచి 40% వరకు డబ్బులు ఇవ్వబోతోంది. అభ్యర్థులు తమకు సంబంధించిన పత్రాలను తీసుకుని ICDS ప్రాజెక్ట్ కార్యాలయానికి వెళ్లి అక్కడ దరఖాస్తులను అందించాల్సి ఉంటుంది. అలాగే అంగన్వాడి కార్యకర్తలు, CDPO ల ద్వారా ఈ దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఈ దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పాత్రల విషయానికి వస్తే.
1). భర్త్ సర్టిఫికెట్
2). ఆదాయ ధ్రువీకరణ పత్రము, కుల సంబంధించిన పత్రం
3). ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో వారికి సంబంధించిన ఆధార్ కార్డు ,రేషన్ కార్డు కాపీలు
4). బ్యాంకు పాసుబుక్ జిరాక్స్
5). ఈ పత్రాలన్నిటి మీద కూడా గెజిటెడ్ అధికారి సంతకం కలిగి ఉండాలి.
ఈ పథకం కింద ఎవరైతే అర్హులు అవుతారో వారికి ప్రతినెల రూ .4 వేల రూపాయలు ఆర్థిక సహాయం కింద అందిస్తారు. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఈ సహాయం 18 ఏళ్ల వయసు వచ్చేవరకు అందిస్తారు.
తల్లితండ్రులు కోల్పోయిన పిల్లలు మార్చి - 31.. 2025 నాటికి 18 ఏళ్లలోపు ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలకు కూడా వర్తిస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం పల్లెలలో 72000, పట్టణాలలో 90000 లోపు ఉన్నవారు అర్హులు. అలాగే 2015 చట్టం ప్రకారం.. నిరాధారణకు గురైన పిల్లలు కూడా అర్హులే.