తాజాగా వైసీపీ కీల‌క నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమ‌రావ‌తే ఏపీ రాజ‌ధాని అని.. మ‌ళ్లీ జ‌గ‌న్ సీఎం అయితే ఆయ‌న అమ‌రావ‌తి నుంచే పాల‌న చేస్తార‌ని చెప్పారు. అయితే గ‌త వైసీపీ పాల‌న‌లో పార్టీ అధినేత‌, అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్ అంత‌కుముందు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ట్టుగా అమ‌రావ‌తి ఏకైక రాజ‌ధాని కాద‌ని.. మూడు రాజ‌ధానుల‌ను తెర‌మీద‌కు తెచ్చారు. జ‌గ‌న్ పాల‌న‌లో అడ్మినిస్ట్రేటివ్ రాజ‌ధాని, న్యాయ రాజ‌ధాని, శాస‌న రాజ‌ధాని అంటూ మూడు రాజ‌ధానుల‌ను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చి.. వైజాగ్ నుంచే పాల‌న న‌డుస్తుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే ఆయ‌న పాల‌న పూర్త‌య్యేవ‌ర‌కు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టారే త‌ప్పా ఆయ‌న వైజాగ్ నుంచి పాల‌న చేసింది లేదు.


ఇక ఇప్పుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి మ‌ళ్లీ జ‌గ‌న్ సీఎం అయితే అమ‌రావ‌తి నుంచే పాల‌న చేస్తార‌ని ప్ర‌క‌టించ‌డంతో జ‌గ‌న్ ఇక మూడు రాజ‌ధానుల అంశాన్ని అట‌కెక్కించేశారా ? అన్న ప్ర‌శ్న‌లు స‌హ‌జంగానే త‌లెత్తుతాయి. అయితే జ‌గ‌న్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అయితే అమ‌రావ‌తి నుంచి పాల‌న కొన‌సాగిస్తార‌ని ప్ర‌క‌టించ‌డం వ‌ర‌కు బాగానే ఉంది.  ఆ మాట ఏదో స‌జ్జ‌ల చెప్ప‌డం కంటే నేరుగా జ‌గ‌నే మీడియా స‌మావేశంలో చెపితే జ‌నాల‌కు ఓ క్లారిటీ ఉంటుందిగా అన్న ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ కూడా ఉంది. జ‌గ‌న్ డైరెక్టుగా మాట చెపితే నాడు మూడు రాజ‌ధానులు అంటూ జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌కు విలువ లేకుండా పోతుంది.. అప్పుడు జ‌గ‌న్ కూడా యూట‌ర్న్ మాస్ట‌ర్ అన్న ముద్ర వేయించుకోవాల్సి వ‌స్తుంది. అందుకే జ‌గ‌న్ ఇలా స‌జ్జ‌ల‌తో మాట్లాడించార‌ని అంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: