కవిత కేసీఆర్ నమ్మిన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే గొప్ప లీడర్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఆమె దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, బీఆర్ఎస్ పార్టీలో ఉండే లొసుగులన్నీ బయటపెడుతున్నారు. అంతేకాదు తండ్రిని గౌరవిస్తూ అన్న కేటీఆర్, బావ హరీష్ రావులను  రోడ్డుకు లాగుతున్నారు..పార్టీని పాడు చేసేది వీరే అంటూ బహిరంగంగానే చెబుతున్నారు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీపై కవిత తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. ఇదిలా నడుస్తున్న సమయంలో కవిత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.. కరీంనగర్ పర్యటనలో భాగంగా కవిత మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి బయట పెట్టింది. పార్టీలో నాకు తీవ్ర అన్యాయం జరిగిందని,అది భరించలేక నేను బయటకు వచ్చానని తెలియజేసింది. 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వినగానే ముఖ్యంగా నా భర్త ఫోన్ ట్యాప్ చేశారనే విషయం తెలియగానే నా కడుపులో దేవినట్టైందని, అది విన్న తర్వాత అసలు విషయం బయట పెట్టాలని నాకు అనిపించిందని  అన్నది. సొంత బావ ఫోన్ ట్యాపింగ్ చేయించారని, అలాంటి వారిని ఏమనాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆత్మగౌరవం కోసం పార్టీ నుంచి బయటకు వచ్చానని, ఉద్యమంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇబ్బందులు పడ్డ ప్రతి ఒక్కరు నాతో టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ, బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను కవిత బయటపెడుతోంది.

మరి ఈ వ్యవహారాన్ని అసలు ఏమనుకోవాలి.. సొంత కుటుంబ సభ్యులని ఆమె నిందిస్తోంది అంటే నిజంగానే బీఆర్ఎస్ హయాంలో వీరంతా తప్పులు చేశారా.. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. ఫోన్ ట్యాపింగ్, అవినీతి వ్యవహారాల గురించి వెంటనే సిబిఐ ఎంక్వయిరీ చేయించి అన్ని విషయాలు బయటపెట్టాలని ప్రజలనుకుంటున్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా కవిత ఈ వ్యాఖ్యలు చేయడంతో  కాంగ్రెస్ కు కాస్త మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: