అఖండ భారతదేశానికి ప్రధాన శత్రువు పాకిస్తాన్.. నిజానికి భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ మొత్తమే లేకుండా చేయవచ్చు.. కానీ భారత్ అలా చేయకుండా సంయమనం పాటిస్తూ ఐక్యరాజ్యసమితి నిబంధనల మేరకు ముందుకు వెళ్తోంది. ఇతర దేశాల వ్యక్తులు చెప్పిన దాని ప్రకారమే నడుచుకుంటూ ఓ లైన్ లో వెళ్తోంది. ఓపికతో ఉన్న పాకిస్థాన్ మాత్రం భారత్ సహనాన్ని పరీక్షిస్తూ ఏదో ఒక విధంగా కెలికేస్తోంది. దానికి లోలోపల సపోర్టు చైనా ఇస్తూ వస్తోంది.. పాకిస్తాన్ దేశం ఎంతో చిన్నదైనా కానీ, ఎంతో సైన్యం ఉన్నటువంటి భారత్ పై తొడగొడుతూ మీసాలు మెలివేస్తోంది..వాళ్లు చేసినట్టు భారత్ చేస్తే మాత్రం అసలు నామరూపాలు లేకుండా పోతుందనేది వారికి అర్థం కావడం లేదు. ఆ మధ్య  కొంతమంది టెర్రరిస్టులు కాశ్మీర్ కు వచ్చి బాంబులు పేల్చి, తుపాకులతో దాడి చేసి  చాలామందిని పొట్టన పెట్టుకున్నారు. 

దీనికి ప్రతిదాడిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం విరుచుకుపడి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య చిన్నపాటి యుద్ధమే  వచ్చిందని చెప్పవచ్చు. ఇంతలో అమెరికా ఎంట్రీ ఇచ్చి ఇద్దరి మధ్య సందీ కుదిర్చారు. ఇదిలా నడుస్తున్న సమయంలో తాజాగా పాకిస్తాన్ మరోసారి తన వక్ర బుద్ధి చూపిస్తోంది. నిజానికి మన భారత్ పక్కన పాకిస్తాన్ ఉండడం మన దురదృష్టం.. ఎప్పుడు ఏదో ఒక విధంగా గెలుకుతూనే ఉంటుంది. అయితే తాజాగా వాళ్ళు ప్రత్యక్షంగా పోరాడలేమని తెలుసుకొని మన పౌరులను బంధిస్తున్నారు. అయితే సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు పట్టుకునే జాలర్లు  అలా పట్టుకుంటూ పట్టుకుంటూ సముద్రాలలో కాస్త బార్డర్ దాటుకొని ముందుకు వెళుతూ ఉంటారు.

 ఈ సమయంలో ఇది మా బార్డర్ అని పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ వాళ్ళని బంధిస్తున్నారు. అంతేకాదు వీళ్లు  ఇండియాకు సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేస్తున్నారు. పాకిస్తాన్ తాజాగా ఈజాజ్ మల్ల అనే వ్యక్తిని అరెస్టు చేశారు. భారత్ మత్స్యకారుల ముసుగులో ఒక గూఢచారిని మనపైకి పంపిస్తున్నారు అంటూ ఒక నింద వేశారు. అంతే కాదు వాళ్ళ దగ్గర ఒక ఆర్మీ డ్రెస్ దొరికిందని, సిగరెట్ ప్యాకెట్, లైటర్ ఇతర వస్తువులు కూడా దొరికాయని అంటున్నారు. ఈ విధంగా మన భారతదేశానికి సంబంధించిన జాలర్లను అరెస్టు చేస్తూ వారిపై లేనిపోని కేసులు పెడుతున్నారు. ఈ విధంగా పాకిస్తాన్ డైరెక్ట్ గా ఎదుర్కోలేక మన పౌరులను బంధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: