వేద పండితులు చెప్పిన ప్రతి విషయంలోనూ ఎంతో గొప్ప నిగూఢ రహస్యం దాగి ఉంటుంది.  ఇప్పటికే పెద్దవాళ్లు చెప్పిన సామెతల్లో ఎంతో పరమార్థం దాగిన ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.  మనం ఇతరులకు ఎన్ని సలహాలైనా ఇవ్వవచ్చు. కానీ ప్రవర్తన నేర్పలేం. -మనలను తప్పులు పట్టేవారే మనకు గురువులు... లక్ష్యం లేని జీవితం ఎందుకూ కొరగాదు, -ఇతరులలో ఎప్పుడూ మంచినే చూస్తూంటే, దు:ఖం మన దరి చేరదు. మొదట మనం పరివర్తన చెంది, ఇతరులు పరివర్తన చెందడానికి స్పూర్తి అవ్వాలి.. చితి నిర్జీవులను కాలుస్తుంది…చింత సజీవులను దహిస్తుంది. అంతా మన మంచికే సుఖమైనా దుఖ్ఖమైనా జీవులకు సంబంధించి అనుభవించవలసిందే తప్ప దాన్ని తప్పించుకునే అవకాశం లేదు.

 

ఏమి జరిగిందో అది బాగా జరిగింది, ఏమి జరుగుతుందో అది బాగా జరుగుతోంది, ఏమి జరగబోతుందో అది కూడ బాగా జరుగుతది అనే ఈ జ్ఞానాన్ని మనసులో నిలుపుకున్న మనిషి కష్టాల కడలిలో చిక్కుకున్నా, దుఖ్ఖమనే పెను తుఫాను చుట్టు ముట్టినా, ఆఖరికీ మరణానికి చేరువ కాబోతున్నా గుండె నిబ్బరంతో నిలుస్తాడు. చరిత్రలో విజేతగా మిగులుతాడు గెలుపు.   ఆత్మవిశ్వాసానికి మూలం ప్రశాంతతే  సమస్య ప్రతి జీవికి ఉంటుంది.సమస్య లేని జీవి ఉండడు.అది ఏ రూపంలో నైనా ఉండవచ్చు.

 

దీని మూలంగానే ప్రశాంతతకు దూరంగా బతకనక్కరలేదు.ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా బతకడం నేరిస్తేనే జీవితాన్ని కాచి ఒడబొసిన వాళ్ళమవుతాము.ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎదురొడ్డి పోరాడి గెలుపును సాధించడమే జీవిత పరమార్థం.  బంధుత్వానికి కులగోత్రాలు కలవాలి కాని స్నేహితానికి అవి అవసరం లేదు.మన స్నేహితుడు మనం పాపకార్యాలు చేస్తుంటే వారిస్తాడు, మన రహస్యాలని బయటకు పొక్కనివ్వడు.మనం కష్టాలలో ఉంటే వదిలి వెళ్ళడు. డబ్బులేక బాధపడుతుంటే సహాయం చేస్తాడు.మంచి మిత్రుడు కంటికి రెప్పలాగ కాపాడుతాడు. కనుక మంచి మిత్రులను మనము సంపాదించుకుందాము. మనము వారికి మంచి మిత్రులగానే ఉందాము. 

మరింత సమాచారం తెలుసుకోండి: