సాధారణంగా తులసి మొక్కను లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ తులసి మొక్కను అత్యంత పవిత్రంగా మన భారతీయులు పూజిస్తారు అన్న విషయం తెలిసిందే. ఈ తులసి మొక్కలను  ఎంత పవిత్రంగా పూజిస్తామో,  మన ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కూడా అంతే ఎక్కువ స్థాయిలో వస్తాయనేది హిందువులు  నమ్మకం. ఇకపోతే ఈ తులసి మొక్క మన ఇంట్లో జరగబోయే శుభ, అశుభాలకు కూడా సంకేతం.మన ఇంట్లో శుభం జరగబోతోంది అన్నప్పుడు , చెట్టు కల కల లాడుతూ ఏపుగా పెరుగుతుంది. ఇక ఏదైనా అశుభం జరగబోతోంది అన్నప్పుడు, ఈ తులసి చెట్టు కూడా వాడి పోవడం జరుగుతుంది. అందుకే ఈ మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తారు.

ప్రతి ఒక్కరికి ఉన్న సందేహం ఏమిటంటే, తులసి మొక్కకు ఏ వేళలో నీళ్లు పోయాలి.. ఎప్పుడు నీళ్లు పోయకూడదు అని. ఇక ఈ సందేహానికి వాస్తు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకుంటున్నారు. అవేంటంటే వాస్తు శాస్త్ర ప్రకారం.. తులసి మొక్కకు ఫలానా సమయంలో మాత్రమే నీళ్లు పోయాలి అని వారు చెబుతున్నారు. హిందువులు ప్రతిరోజు తలస్నానం చేసి, తులసి మొక్కకు నీళ్లు పోసి పూజిస్తారు. ఇక ఈ తులసి మొక్క ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇకపోతే మనకు వీలు కుదిరినప్పుడల్లా నీళ్లు పోస్తే సరిపోదు. ముఖ్యంగా ఆదివారం, ఏకాదశి, చంద్రగ్రహణం అలాగే  ప్రతి రోజు సాయంసంధ్య వేళలో తులసి మొక్కకు నీళ్లు పోయడం అస్సలు మంచిది కాదట.

అంతేకాదు చంద్రగ్రహణం రోజున, ఏకాదశి రోజున, ఆదివారం రోజున కూడా తులసి మొక్క ఆకులను తెంపరాదు. అందుకే ఈ తప్పులు ఎవరైనా చేస్తూ ఉంటే వాటిని ఇప్పుడే మానుకోండి. ముఖ్యంగా ప్రతి  గురువారం  సాయంత్రం తులసి మొక్కకు పచ్చిపాలు పోసి , నెయ్యితో దీపం పెట్టడం వల్ల శుభం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: