క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మకమైన ఆసియాకప్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ శ్రీలంక లో నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అక్కడ ఆర్థిక సంక్షోభం పెరిగిపోవడం రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో శ్రీలంక వేదికగా కాకుండా యూఏఈ వేదికగా నిర్వహించేందుకు నిర్వహించారు. ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఈ టోర్నీ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఆసియా కప్ అధికారిగా ప్రసార హక్కులు కలిగి ఉన్న స్టార్ స్పోర్ట్స్ ఇటీవలే ఆసియా కప్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల 2022 ఆసియా కప్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేసింది. ఇక ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ మెగా ఈవెంట్ లో ఆరు దేశాలకు సంబంధించిన జట్లు పాల్గొనబోతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ భారత్ శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ జట్లు నేరుగా ఆసియా కప్ లో అర్హత సాధించాయి. హాంకాంగ్,  యూఏఈ, సింగపూర్ కువైట్ ఇక ఆరోజు జట్టుగా అర్హత సాధించేందుకు పోటీ పడుతూ ఉండడం గమనార్హం.


 అయితే ఇటీవలే స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ఒక ప్రోమో లో ఇండియా విజయాన్ని కాంక్షిస్తూ ఒక పాటతో కూడిన వీడియో ని రూపొందించారు. ఈ వీడియో లో భాగంగా మా ఇండియా నెంబర్ వన్ ఇప్పుడు మేము ఆసియా కప్ను గెలుస్తాం.. మా పొరుగు దేశాలు కూడా ఆసియా కప్ గెలవడానికి ఆరాటపడుతున్నాయ్. కానీ సగర్వంగా ఎగురుతున్న మువ్వన్నెల జెండా సాక్షిగా మేము ఇక్కడికి గెలవడానికి వచ్చామన్నది మా ప్రత్యర్థులకు చెబుతున్నాము అంటూ సాగే టీమిండియా ఉద్దేశాన్ని ప్రోమో లో చేర్చారు అని చెప్పాలి. కాగా ఈ టోర్నీలో భాగంగా భారత్ పాకిస్థాన్ మ్యాచ్ మరింత ప్రత్యేకం గా మారబోతుంది అని చెప్పాలి. ఆగస్ట్ 28వ తేదీన చిరకాల ప్రత్యర్ధుల మధ్య మ్యాచ్ జరగబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: