ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో టీమిండియా కూడా మొదటి వరుసలో కొనసాగింది అని చెప్పాలి. అయితే టీమిండియా రోహిత్ శర్మ సారథ్యంలో అద్భుతంగా రాణించి  కప్పుకొట్టుకొని ఇంటికి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో టీమిండియా మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది అని చెప్పాలి. లీగ్ మ్యాచ్ లలో బాగానే రాణించినప్పటికీ కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం టీం ఇండియా చేతులెత్తేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీం ఇండియా ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.


 అయితే టీమిండియా పేలవమైన ప్రదర్శన అటు బీసీసీఐ కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక వచ్చే వరల్డ్ కప్ నాటికి టీమిండియాలో సమూలమైన మార్పులు చేయాలనే యోచనలో ప్రస్తుతం బీసీసీఐ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.  గత కొంతకాలం నుంచి బిసిసిఐ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని అవాక్ అయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా సౌరబ్ గంగూలీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని రోజర్ బిన్నీ  కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు.


 ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా టీమిండియా సెలక్షన్ కమిటీ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి వేటువేయడం సంచలనగా మారిపోయింది. టి20 వరల్డ్ కప్ లో వైఫల్యం పై బీసీసీఐ పెద్దలు సెలెక్టర్లపై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. సెలక్షన్ కమిటీ చీఫ్ చేతన్ శర్మ సహా ఐదుగురు సభ్యులపై వేటు వేసింది. ఆ స్థానంలో కొత్త వాళ్లను నియామకం చేపడుతున్నట్లు ఇటీవల ప్రకటన విడుదల చేసింది బీసీసీఐ. ఈనెల 28 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చింది. మరోవైపు టి20 కెప్టెన్గా హార్దిక్ పాండ్యాకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తారని టాక్ కూడా ప్రచారంలో ఉంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: