క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూసిన తర్వాత జనాలకు ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే నారావారి వారసుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ కు పరిమితమైపోతే పాల్ మాత్రం యాక్షన్లోకి దిగేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయాల్సిందే అని చంద్రబాబు, లోకేష్ అండ్ కో ఒకటే గోల చేస్తున్న విషయం తెలిసిందే. వీళ్ళతో పాటు ఇతర ప్రతిపక్షాల నేతలు కూడా సృతి కలిపారు. తాజాగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఇలాంటి డిమాండే చేశారు. అయితే పాల్ డిమాండ్ చేయటంతో సరిపెట్టుకోకుండా ఏకంగా నిరాహారదీక్షకే దిగేశారు.  విశాఖపట్నంలోని పాల్ ఫంక్షన్ హాలులో గురువారం నుండి నిరాహార దీక్ష మొదలుపెట్టారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటాన్ని పాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.




ఇదే అంశంపై తెలుగుదేశంపార్టీ, వామపక్షాలు, బీజేపీ, జనసేనలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అయితే పై పార్టీల అధ్యక్షులు, సీనియర్ ఎంతసేపు ప్రభుత్వాన్ని బెదిరించే ధోరణిలోనే మాట్లాడుతున్నారు. ట్విట్టర్లోనో, ఫేస్ బుక్ ఖాతాల్లో, మీడియా సమావేశాలకు మాత్రమే ప్రతిపక్షాల నేతల బెదిరింపులు పరిమితమైతే పాల్ మాత్రం ఏకంగా నిరాహారదీక్షకు కూర్చోవటం గమనార్హం. ప్రతిపక్షాల్లో మిగిలిన నేతల సంగతి ఎలాగున్నా లోకేష్ మాత్రం ఉత్త బెదిరింపులకే పరిమితమవుతున్నారు. ఏ విషయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డిని ట్విట్టర్లో బెదిరిస్తున్న విషయం అందరు చూస్తున్నదే. తమ డిమాండ్ ను పట్టించుకోకపోతే అది చేస్తాం, ఇది చేస్తం అంటూ కాలా వెళ్ళదీస్తున్నారు. ఇంతా చేసి ఏదీ చేసేదుండదు. అందుకనే లోకేష్ తో పోల్చుకుంటే కేఏ పాల్ చాలా నయమనే అనుకుంటున్నారిపుడు.




పాల్ కూడా పరీక్షల రద్దు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ ను పట్టించుకోకపోతే దీక్షకు దిగుతానని కూడా హెచ్చరించారు. తీరా ప్రభుత్వం హాల్ టికెట్లను జారీ చేయటం మొదలుపెట్టడంతో ఏకంగా నిరాహారదీక్షే మొదలుపెట్టేశారు. నిరాహార దీక్షలో కూర్చోవటం మాత్రమే కాకుండా ఇప్పటికే ఇదే విషయమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు కూడా వేశారు. తాను వేసిన కేసును విచారణకు కోర్టు స్వీకరించినట్లు పాల్ చెప్పారు. శుక్రవారం విచారణ జరుగుతుంది. 35 లక్షలమంది విద్యార్ధులకు మేలు జరిగే వరకు తన నిరాహార దీక్ష విరమించేది లేదని గట్టిగానే చెబుతున్నారు పాల్. ఇంతకాలం పాల్ లో క్యామిడీ యాంగిల్ మాత్రమే చూసిన జనాలు ఇపుడు సీరియస్ యాంగిల్ కూడా చూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: