సాధారణంగా హిందువులు ఎక్కువగా నిత్య పూజలు చేస్తుంటారు. కొందరు ఉదయం మాత్రమే చేస్తుండగా మరికొందరు సంధ్యా సమయంలో దీపారాధన చేస్తుంటారు. ఇంకొందరు రెండు పూటలా పూజలు చేస్తుంటారు. అయితే కొందరు ఇక్కడ కొన్ని నియమాలు తెలియక  పొరపాట్లు చేస్తుంటారు. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. చాలా మంది తల స్నానం చేయకుండా దీపారాధన చేయకూడదని తొందర్లో తలపై ఒట్టిగా నీళ్లు పోసుకుని వచ్చేస్తుంటారు. కాని ఇలా అస్సలు చేయకూడదని ఈ విధంగా చేయడం చాలా అశుభం అని చెబుతున్నారు వేద పండితులు. కేవలం అశుభం జరిగిన ఇంట్లోనే, అశుభ సందర్భాలలోనే ఇలా తలపై ఒట్టిగా నీల్లు పొసుకుంటారని ఇటువంటి పద్దతులు పూజ సమయంలో పనికి రావని అంటున్నారు. 

పూజ చేయాలని తల స్నానం చేసేవారు తప్పకుండా షాంపూ లేదా కుంకుడుకాయలో ఎదో ఒకటి వాడాలని చెబుతున్నారు. అలాగే ప్రతి రోజూ తల స్నానం చేయకూడదని ఆదివారం తల స్నానం చేస్తే అనారోగ్యమని, సోమ, మంగళ, గురు, శుక్ర వారాలి తల స్నానం చేస్తే అరిష్టమని, మరియు శనివారం తల స్నానం చేయడం మంచిదని శాస్త్ర రిత్యా చెప్పబడింది. శనివారం నాడు పిల్లలు పెద్దలు నువ్వుల నూనె తలకంటుకొని చక్కగా తలస్నానం చేయడం ద్వారా గ్రహపీడలు కూడా పోతాయని, వారిపై ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయని తెలుపుతున్నారు పండిత మహాశయులు.

ఇక వివాహితుల విషయానికొస్తే భర్తలతో ఉన్నామని, బయటకు వెళ్లి వచ్చామని ఇలా పలు రకాల కారణాల వలన తల స్నానం చెయ్యందే పూజ చేయకూడదని కొందరు అంటుంటారు. కానీ అలాంటిదేమీ లేదని ఇటువంటి సమయాలలో వివాహితులు ఒంటికి కాస్త పసుపు రాసుకుని స్నానం చేసినట్లైతే ఆ దోషం కాస్త తొలగిపోతుందని పేర్కొన్నారు. కాబట్టి పూజ నిర్వహించే మహిళలు ఏ రోజు తల స్నానం చెయ్యాలి అనే విషయమై ఒక అవగాహన కలిగి ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: