మహిషాసురుడు అనే రాక్షసుడుని చంపడం కోసమే దేవతలందరూ కలిసి దుర్గాదేవిని సృష్టించడం జరిగింది. దుర్గా దేవి మహిషాసురుడితో ఏకంగా తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి, పదవ రోజు అనగా దశమినాడు మహిషాసురుడిని అంతమొందిస్తుంది. అందుకే నవరాత్రులతో పాటు దసరా ను ఎంతో ఘనంగా జరుపుకుంటారు హిందువులు.. అంతేకాదు రామాయణంలో రాముడు కూడా రావణుడిని చంపింది దసరా రోజునే.. అలాగే పాండవులు కూడా వనవాసం పూర్తి అయిన తర్వాత జమ్మి చెట్టు నుంచి తిరిగి తమ ఆయుధాలు తీసుకున్నది కూడా ఆ రోజునే కాబట్టి దసరాకు అంత ప్రాముఖ్యం ఉంటుంది.

అయితే ఈ తొమ్మిది రోజులలో అమ్మవారు ఏ ఏ రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తారు..ఈ రూపాల వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

మొదటి రోజు.. శ్రీ స్వర్ణకవచ అలంకరణ దుర్గాదేవి:
ఈ అలంకారం లో ఉన్నప్పుడు అమ్మవారిని దర్శించుకున్నట్లయితే సకల దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయట.

రెండవ రోజు.. శ్రీ బాల త్రిపుర దేవి అలంకరణలో దుర్గాదేవి: బుద్ధి , మనస్సు అమ్మవారి అధీనంలో ఉంటాయి కాబట్టి , పండితులు బాలార్చన చేస్తారు. ఈ రోజున 2 నుండి 10 సంవత్సరాలకు బాలికలను అమ్మవారి ప్రతీకలుగా చూసుకుంటారు..ఈ  అమ్మవారిని దర్శించుకుంటే శుభమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

మూడవరోజు.. శ్రీ గాయత్రి దేవి :
ఈ అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సిద్ది లభిస్తుందని ఉపాసకులు చెబుతున్నారు.

నాల్గవ రోజు .. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి:
లక్ష్మీ దేవి, సరస్వతి దేవి ప్రతీకలుగా శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిని భక్తులు కొలుస్తారు.

ఐదవ రోజు.. శ్రీ అన్నపూర్ణ దేవి:
తెలంగాణలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అన్న  పాణాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని జీవితకాలం సౌఖ్యంగా అన్నపూర్ణాదేవి మనపై కరుణ కటాక్షం చూపిస్తుందని నమ్మకం.

ఆరవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి:
ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అష్టైశ్వర్యాలతో ఎటువంటి ఇబ్బంది ఉండదని, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం వల్ల అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడూ మనపై ఉంటాయని నానుడి.

ఏడవ రోజు.. శ్రీ సరస్వతీదేవి: ఈ రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి విద్యార్థులు వేలసంఖ్యలో క్యూ కడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ఒక్కరోజు అమ్మవారిని దర్శించుకుంటే తాము చదువులో ఉన్నత స్థాయికి ఎదుగుతాము అని విద్యార్థులు భావిస్తారు.

ఎనిమిదవ రోజు.. శ్రీ దుర్గా దేవి: దుర్గతులను పోగొట్టే దుర్గాదేవిగా ఈ రోజు అమ్మవారు దర్శనమిస్తారు.

తొమ్మిదవ రోజు.. శ్రీ మహిషాసుర మర్దిని దేవీ:
దుష్టుడు మహిషాసురుడిని అమ్మవారు వధించి మహిషాసురమర్దినిగా అమ్మవారు రూపాంతరం చెందింది.

పదవరోజు .. శ్రీ రాజరాజేశ్వరి దేవి:
చెడుపై విజయాన్ని పొందిన అమ్మవారు చక్కటి రూపాన్ని అలంకరించి , శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం ఎత్తుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: