సాధారణంగా సూర్యుడు కర్కాటక రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రాంతి.మకర సంక్రమణకు ముందున్న కాలమునంతా దక్షిణాయన కాలమని,సూర్యుడు మకర సంక్రమణము జరిగినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది.సాధారణంగా దేవతలకు ఒక సంవత్సర కాలము ఒక రోజుతో సమానము.దక్షిణాయన కాలమును రాత్రి సమయమని,ఉత్తరాన కాలమును పగటి సమయమని చెబుతుంటారు.దక్షిణాయన కాలంలో దేవతలు నిద్రిస్తూ,ఉత్తరాయణ కాలంలో మేల్కొని ఉండడం వల్ల,ఉత్తరాయన కాలమును పుణ్యకాలమని చెబుతారు.ఈ సమయంలో దేవతలను కొలుచుకుని,దానధర్మాలు చేయడం వల్ల సకల పుణ్యాలు కలుగుతాయి.అసలు ఈ సమయంలో ఎలాంటి వస్తువులు దానం చేయడం వల్ల,ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనము తెలుసుకుందాం పదండి..

 నువ్వుల చలిమిడి..

ఈ మాసంలో నువ్వులను దానం ఇవ్వడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయి.కానీ నువ్వులను దానం తీసుకోవడానికి చాలా మంది ఒప్పుకోరు.కావున నువ్వుల బెల్లంతో తయారు చేసిన చలిమిడి ఇస్తే అందరు ఇష్టంగా తీసుకుంటారు.మరియు సాధారణంగా నువ్వులకు వేడి చేసే గుణం ఉంటుంది కనుక.ఈ చలికాలంలో నువ్వులతో తయారు చేసిన ఆహార పదార్థాలు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

పెరుగు..

సంక్రాంతి సమయంలో పురాణాల ప్రకారం పెరుగు దానం ఇవ్వడం వల్ల,మన ఇంట్లో ఉన్న సకల పాపాలు సకల కష్టాలు తొలగిపోయి,అష్టైశ్వర్యాలు మన వాకిలి తొక్కుతాయని చెబుతున్నాయి.పూర్వం ద్రోణచార్యుడు విద్యలు నేర్పించడంలో మునిగిపోయి,ఇంట్లో ఉన్న పిల్లలకు సైతం ఆహారం లేవని గాని ఆలోచించడు. అలాంటప్పుడు ఒక మహర్షి వచ్చి ద్రోణాచార్యుడు భార్యకు పెరుగు దానం ఇవ్వనివని కోరగా,ఆమె పెరుగుదలకు ఇస్తుంది.ఆ సమయం అప్పటినుంచి ద్రోణాచార్యుల వారికి రాజు యొక్క నీడ దొరుకుతుంది. కావున ఎవరైనా,ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే,పెరుగు దానం ఇవ్వడం చాలా ఉత్తమం.

మినుములు..

పెళ్ళికాని పిల్లలు కానీ,సంతానం లేమీతో బాధపడేవారు కానీ మినుములు దానం ఇవ్వడం వల్ల,వారి సమస్యలు తొలగి వెంటనే పెళ్ళి కాని వారికి పెళ్లి,సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది.

కావున ప్రతి ఒక్కరూ సంక్రాంతి సమయంలో కచ్చితంగా ఈ మూడు వస్తువులు దానం చేయడానికి ప్రయత్నించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: