ఎట్టకేలకు వినాయక చవితి పండుగ హిందువులకు ఈరోజు  రానే వచ్చింది. సుమారుగా 10 రోజులపాటు కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఉత్సవాల కోసం వినాయకుడి విగ్రహాలను కూడా ముస్తాబు చేసి ప్రతి ఊరు, ప్రతి గ్రామం , విధులలో బొజ్జ గణపయ్య విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. వినాయక పండుగని చాలా సందడిగా చేసుకుంటూ ఉంటారు ప్రజలు. వినాయక మండపాల దగ్గర ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ తెగ సందడి చేస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా ఎంతో ఇష్టంగా కోలాహలంగా జరుపుకునే ఈ వినాయక పండుగ(ఈరోజు) ఏ సమయంలో జరుపుకోవాలో ఇప్పుడు చూద్దాం.


హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసం, శుక్లపక్ష చతుర్థి రోజున ఈ వినాయక పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున వినాయక చవితి సందర్భంగా గణేష్ చతుర్థి పూజా విధానం శుభ సమయం గురించి కొంతమంది పండితులు తెలియజేశారు.

చతుర్థి తిది ఆగస్టు 26 మధ్యాహ్నం 1:54 గంటలకు మొదలై..ఆగస్టు 27 మధ్యాహ్నం 3:44 గంటలకు ముగిస్తుంది.


అయితే శుభముహూర్తం విషయానికి వస్తే ఆగస్టు 27  11:05AM నిమిషాల నుంచి 1:40 PM వరకు వినాయకుడికి పూజలు చేయాలి. ఇది శుభముహూర్తంగా పండితులు తెలియజేస్తున్నారు.



ఇక వినాయక విగ్రహాన్ని ఒక పీఠపైన ఉంచి, ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపైన విగ్రహాన్ని ఉంచాలి. ఆ తర్వాత వినాయకుడిని శుభ్రంగా తుడిచి కుంకుమ, పసుపు, గంధం పూలతో అలంకరించాలి.


పూజ ప్రారంభించేందుకు ముందుగానే మీ మనసులో యొక్క ఉద్దేశాన్ని తలుచుకొని వినాయకుని పూజించాలి.


ఆ తర్వాత పండితులతో గణపతి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయించాలి. వినాయకుడికి గంగాజలం నీటితో అభిషేకం చేసి కొత్త వస్త్రాన్ని, జంధ్యం సమర్పించాలి.


గణపతికి ఇష్టమైన  వాటిని నైవేద్యంగా పెట్టి ఆకులతో పూజించాలి.


చివరిగా నెయ్యితో దీపాన్ని వెలిగించి గణపతికి హారతి ఇవ్వడం వల్ల చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: